Most Recent

Maruthi: దర్శకుడు మారుతికి పితృవియోగం.. పలువురి సినీ ప్రముఖుల సంతాపం

Maruti

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు మారుతి(Maruthi) తండ్రి కన్నుమూశారు. మారుతి తండ్రి వన కుంచెల రావు(76) మచిలీపట్నంలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా మారుతి తండ్రి కన్నుమూసినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో మారుతి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. చిన్న హీరోల దగ్గరనుంచి ఇప్పుడు పెద్ద హీరోలను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు మారుతి. ఈ సమయంలో ఆయనకు పితృవియోగం కలగడం అందరిని కలిచివేస్తోంది. మారుతి తండ్రి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. మారుతి చిన్న వయసులో కుంచెల రావు బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవారట. ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించేవారట.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.