Most Recent

Beast: ఈ సారి దళపతి విజయ్‌ను దించేసిన టాంజానియా కుర్రాడు.. వీడియో వైరల్

Beast

దళపతి విజయ్ నటించిన బీస్ట్(Beast) సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దుసుకుపోతోంది. ఈ సినిమా దళపతి(Thalapathy vijay) రా ఏజెంట్ గా కనిపించి ఆకట్టుకున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. ఈనెల 13న బీస్ట్థి యేటర్లో రిలీజైంది. కాగా, విజయ్‌ ఫ్యాన్స్ బేస్ మామూలుగా ఉండదు. థియేటర్లో సినిమా రిలీజైతే వారి ఆనందాలకు అవధులే ఉండవు. విజయ్ నుంచి సినిమాలకు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో ఆ హంగామానే వేరు. తాజాగా విడుదలైన ‘బీస్ట్’ విషయంలోనూ ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాల్ని అరబిక్ కుతూ పాట సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే. ఈ పాటకు ఇప్పటికే చాలా మంది డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. సినిమా తారలు సైతం అరబిక్ కుతూ పాటకు స్టెప్పులేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రీ క్రియేట్ చేశాడు టాంజానియా కుర్రాడు కిలీ పాల్. ఇతడు గతంలో సౌత్ సాంగ్స్ కు డ్యాన్స్ చేసి తెగ పాపులర్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి బీస్ట్ ట్రైలర్ ను రీ క్రియేట్ చేసి హాట్ టాపిక్ గా మారాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో కిలీ పాల్ ఫ్యాన్స్ తోపాటు విజయ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ వీడియో 1 మిలియన్ వ్యూస్ ను దాటేసింది. బీస్ట్ ట్రైలర్ లో చూపించినట్టుగా ఈ వీడియోలో కిలీ పాల్ వైట్ షర్ట్, దానిపై బ్లాక్ టక్సేడో వేసుకోను స్టైలిష్ గా కనిపించాడు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kili Paul (@kili_paul)

మరిన్ని ఇక్కడ చదవండి : 

F3 Movie: ఎఫ్ 3 సింగిల్ సాంగ్‏కు భారీ రెస్పాన్స్.. గంటల్లోనే మిలియన్ వ్యూస్..

Viral Photo: క్యూట్ చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి యూత్ ఫెవరేట్.. అమ్మడు ఆ పేరుతో చాలా స్పెషలండోయ్.. గుర్తుపట్టండి..

Ante Sundaraniki: నజ్రియా ఎవరి ఫోన్లు ఎత్తలేదు.. కానీ అందుకు థ్యాంక్స్.. హీరో నాని ఆసక్తికర కామెంట్స్..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.