Most Recent

Keerthy Suresh : లేడీ ఓరియెంటెడ్ మూవీతో కీర్తి బ్యాడ్‌లక్‌ సఖి నుంచి.. గుడ్‌ లక్ సఖిగా మారుతుందా..?

Keerthy Suresh

మహానటిగా నేషనల్ అవార్డ్ విన్నర్‌ అయ్యాక కీర్తి సురేష్(Keerthy Suresh )ఎన్నెన్ని మెట్లు పైకెక్కారో గాని.. ఇప్పుడైతే ఆమెకు చాలా క్రూషియల్ టైమ్ నడుస్తోంది. ఈ పరీక్షలో గనుక నెగ్గితే బ్యాడ్‌లక్‌ సఖి నుంచి.. గుడ్‌ లక్ సఖిగా సర్టిఫికెట్ కొట్టెయ్యడం ఖాయం. కానీ.. ఆ పబ్లిక్ టెస్ట్ అంత ఈజీ ఏమీ కాదమ్మాయ్ అని హెచ్చరిస్తున్నారు వెల్‌విషర్స్. తమిళ సూపర్‌స్టార్‌తో చేసిన పెద్దన్న అంతంతమాత్రమే ఆడింది. కేరళ సూపర్‌స్టార్‌తో నటించిన మరక్కార్ మూవీ చరిత్రలో కలిసిపోయింది. ఇప్పుడు తెలుగు సూపర్‌స్టార్‌తో స్మార్ట్‌గా మరో ట్రయల్ వేస్తున్నారు అభినవ మహానటి. కళావతిగా చాలా గ్యాప్ తర్వాత పూర్తి గ్లామరస్ రోల్‌లో కనిపించబోతున్నారు కీర్తిసురేష్. మే 12న రిలీజ్ కాబోయే సర్కారువారి పాట కంటే జస్ట్ వారం రోజులముందే మరో స్మాల్ ఎఫర్ట్ పెడుతున్నారు కీర్తిసురేష్. లేడీ కానిస్టేబుల్ పాత్రలో సెంట్‌ పర్సెంట్ గ్రే షేడ్స్‌తో కీర్తి నటిస్తున్న మూవీ చిన్ని.. మే 6 అమెజాన్ ప్రైమ్‌లో డిజిటల్ రిలీజ్ కాబోతోంది. ఈమె కీర్తిసురేషేనా అనేంత కొత్తగా ఉంది ట్రైలర్.

సీరియల్‌ కిల్లర్‌గా మారిన ఒక దగాపడ్డ మహిళగా కనిపిస్తారు కీర్తి. గతంలో పెంగ్విన్‌లో గర్భవతిగా, మిస్ ఇండియాలో ఆదర్శభావాలు గల యువతిగా నటించినా.. ఆ రెండూ ఓటీటీకే అంకితమయ్యాయి. ఇప్పుడిది కూడా డిజిటల్‌ డేట్‌ని ఫిక్స్ చేసుకున్నా.. పెర్ఫామెన్స్ పరంగా మంచి హోప్స్ నిస్తోంది చిన్ని మూవీ. ఏదైతేనేం.. జస్ట్ ఒక్క వారం గ్యాప్‌తోనే కళావతి అండ్ చిన్ని క్యారెక్టర్స్‌తో రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌ చూపించబోతున్నారు మహానటి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నటిపై అత్యాచారం కేసులో ట్విస్ట్.. మరో మహిళ ఆరోపణలతో మలయాళీ నటుడిపై రెండో కేసు నమోదు..

Bollywood vs Sandalwood: లాంగ్వేజ్‌ లడాయి.. పొలిటికల్ టర్న్ తీసుకున్న హిందీ భాష వివాదం..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కారు వారి పాట ఎడిటర్..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.