Most Recent

Gopichand: షూటింగ్‌లో గాయపడిన గోపీచంద్‌.. ఆందోళనలో ఫ్యాన్స్‌.. చిత్రబృందం ఏమందంటే..

Gopichand

త్వరలోనే పక్కా కమర్షియల్‌ సినిమాతో మన ముందుకు రానున్నాడు మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ (Gopichand). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది. కాగా ఈ సినిమా తర్వాత శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడీ హీరో. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే లక్ష్యం, లౌక్యం అనే సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతోంది. గోపీచంద్‌కు ఇది 30వ సినిమా. ప్రస్తుత కర్ణాటకలోని మైసూర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. అయితే ఓ ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్‌ స్పాట్‌లో కాస్త ఎత్తైన ప్రదేశం నుంచి కాలు జారి కింద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు గాయాలు కాలేదని, ప్రస్తుతం గోపీచంద్‌ క్షేమంగానే ఉన్నారని డైరెక్టర్‌ శ్రీవాస్‌ తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

కాగా ఈ సినిమాలో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వెట్రి పళని స్వామి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా మైసూర్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు హీరోహీరోయిన్లపై ఓ పాట చిత్రీకరించనున్నారు. మే తొలి వారంలో ఈ షెడ్యూల్‌ పూర్తికానుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశంతో ఈ చిత్రం రూపొందుతుందని శ్రీవాస్‌ తెలిపాడు. కాగా మారుతి డైరెక్షన్‌లో పక్కా కమర్షియల్‌ సినిమా తెరకెక్కుతోంది. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Jayamma Panchayathi: సుమక్క కోసం రంగంలోకి రంగంలోకి ఆ స్టార్ హీరోలు.. జయమ్మ పంచాయితీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌లు ఎవరంటే..

ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల తయారీదారులను అలా ఆదేశించలేదు.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ..

Jaundice: వేసవిలో ఎక్కువగా అలసిపోతున్నారా..? ఈ వ్యాధి కావచ్చు.. జాగ్రత్త.. ఎలా నివారించాలి..?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.