Most Recent

Bollywood vs Sandalwood: లాంగ్వేజ్‌ లడాయి.. పొలిటికల్ టర్న్ తీసుకున్న హిందీ భాష వివాదం..

Hindi

Bollywood vs Sandalwood: హిందీ భాష వివాదం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. సుదీప్‌-అజయ్‌దేవగన్‌ మధ్య మొదలైన ట్వీట్‌వార్‌.. రచ్చ రచ్చ అవుతోంది. సుదీప్‌కు మద్దతుగా కన్నడ నేతలంతా రంగంలోకి దిగారు. అజయ్‌దేవగన్‌ తీరుపై విరుచుకుపడ్డారు. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా..? లేక మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తుందా?. హిందీ భాష వివాదం బాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌ మధ్య చిచ్చురేపుతోంది. ఈ వివాదంలో సెంటర్‌గా ఉన్న హీరో సుదీప్‌కు కర్నాటక నేతలు, ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. సీఎం బస్వరాజ్‌ బొమ్మై, మాజీ సీఎం సిద్దరామయ్య, జేడీఎస్‌ నేత కుమారస్వామి సుదీప్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హిందీ-కన్నడ వివాదంలో హీరో సుదీప్‌ వాదనే కరెక్టన్నారు సీఎం బస్వరాజ్‌ బొమ్మై. ప్రాంతీయ భాషలు దేశానికి చాలా ముఖ్యమని కీలక వ్యాఖ్యలు చేశారు బస్వరాజ్‌ బొమ్మై.

ఇక అజయ్‌దేవగన్‌కు వ్యతిరేకంగా బెంగళూర్‌లో కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు ఆందోళన చేశారు. అజయ్‌దేవగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. కన్నడ ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దితే సహించే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు సుదీప్‌ చేసిన వాఖ్యలు కరెక్ట్‌ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు సిద్దరామయ్య.

హిందీ జాతీయ భాష కాదని శాండిల్‌వుడ్‌ కిచ్చా సుదీప్‌ చేసిన ట్వీట్‌ ఈ గొడవకు కారణమైంది. సుదీప్‌ హీరోగా పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న సినిమా జూలై 28న రిలీజ్‌ అవుతోంది. అయితే తాజాగా కేజీఎఫ్‌ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీపై సుదీప్ సంచలన కామెంట్స్‌ చేశాడు. హిందీ ఇక నుంచి ఏ మాత్రం జాతీయ భాష కాదంటూ ఓ సమావేశంలో స్పష్టం చేశారు సుదీప్‌. ఈ వివాదంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్‌ సూపర్‌స్టార్స్‌ను చూస్తే బాలీవుడ్‌ స్టార్స్‌కు అసూయ అని అన్నారు. కన్నడ హీరో సుదీప్‌కు ఆయన మద్దతు పలికారు. కేజీఎఫ్‌ ఆల్‌ ఇండియా లెవెల్లో సూపర్‌హిట్‌ కావడంతో బాలీవుడ్ హీరోలు జీర్ణించుకోవడం లేదని ట్వీట్‌ చేశారు రామ్‌గోపాల్‌వర్మ.

హిందీ భాషపై సుదీప్‌-అజయ్‌దేవగన్‌ మధ్య ట్వీట్‌వార్‌ కొనసాగుతోంది. ఈ వివాదం ఇప్పటికే పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. ఇది ఇంతటితో ముగుస్తుందా..? లేక వివాదం ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తుందా..? వేచి చూడాలి.

Also read:

Breast Cancer in Men: పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. ఈ లక్షణాలుంటే వెంటనే అలర్ట్ అవ్వండి..!

Viral Video: వీడ్కోలు సమయంలో బోరున విలపించిన వరుడు.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు..!

Healthy Oats: త్వరగా బరువు తగ్గాలని భావిస్తున్నారా?.. ఓట్స్‌ని ఈ 4 విధాల్లో తీసుకోండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.