Most Recent

Bhala Thandanana : మరో సరికొత్త కాన్సెప్ట్‌తో కుర్ర హీరో.. హిట్టు కొట్టాలన్న కసి మీదున్న శ్రీవిష్ణు

Sree Vishnu Bhala Thandanan

కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ వస్తున్న శ్రీ విష్ణు(Sree Vishnu).. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కొత్త దర్శకులతో సినిమాలను చేస్తూ ఆకట్టుకుంటున్నాడు శ్రీవిష్ణు. తాజాగా ఈ యంగ్ హీరో మరో సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ‘భళా తందనాన'(Bhala Thandanana). వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘భళా తందనాన’. బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులుని ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచింది.

చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీవిష్ణు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. శ్రీవిష్ణు కెరీర్ లో భారీ హిట్స్ లేవు. యావరేజ్ ఆడిన సినిమాలు ఉన్నాయి. కానీ చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం లేవనే చెప్పాలి. మరి ఈ సినిమా శ్రీవిష్ణు కు హిట్ హిట్ ఇస్తుందేమో చెప్పాలి. మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది ‘భళా తందనాన’. చిత్ర యూనిట్ ఈ వారం జోరుగా ప్రమోషన్లను ప్లాన్ చేస్తుంది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయిత గా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నటిపై అత్యాచారం కేసులో ట్విస్ట్.. మరో మహిళ ఆరోపణలతో మలయాళీ నటుడిపై రెండో కేసు నమోదు..

Bollywood vs Sandalwood: లాంగ్వేజ్‌ లడాయి.. పొలిటికల్ టర్న్ తీసుకున్న హిందీ భాష వివాదం..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కారు వారి పాట ఎడిటర్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.