
తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి (Vijay Thalapathy), డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన బీస్ట్ (Beast Movie) సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. ఓవైపు ఈ సినిమా సూపర్ హిట్ అంటూ టాక్ వినిపిస్తుండగా.. మరోవైపు విజయ్ అభిమానులు సినిమా నచ్చలేదంటూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి బీస్ట్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఓ షాపింగ్ మాల్లో ఉన్న జనాలను కొందరు టెర్రరిస్టులు బందీలుగా చేసుకుంటారు. దీంతో మాజీ రా ఏజెంట్ అయిన విజయ్ వారిని ఎలా రక్షించారనేది ఈ మూవీ కథాంశం. ఇందులో విజయ్ వీర రాఘవన్ పాత్రలో కనిపించారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా తమిళనాడులో నిన్న ఉదయం 4 గంటలకే తొలి షో ప్రారంభమయ్యింది.
ఇక ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. యూఎస్ఏల బీస్ట్ సినిమా 426 థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్ వెర్షన్ హక్కులు ఓవర్సీస్ లో పెద్ద మొత్తంలో అమ్ముడు పోయాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 505కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మొదటి రోజే ఈ మూవీ నైజాంలో రూ. 3.05 కోట్లు వసూలు చేసినట్లుగా సమాచారం. అలాగే సీడెడ్‌లో రూ. 2.1 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.40 కోట్లు వసూలు చేసినట్లుగా సమాచారం. ఇక నైజాంలో 175 థియేటర్లలో సీడెడ్‌లో 90 థియేటర్లలో మరియు ఆంధ్రాలో 240 థియేటర్లలో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 505 థియేటర్లలో విడుదలైంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో ‘బీస్ట్’ 40-50% ఆక్యుపెన్సీతో తొలిరోజు రూ. 5-7 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బీస్ట్ సినిమా తొలిరోజే.. రూ. 7.5 కోట్లు వసూలు చేసినట్లుగా సమచారం. ఇక తమిళనాడులో ఈ సినిమా మొదటి రోజే.. రూ. 30 నుంచి 35 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మూవీ రూ. 50కోట్ల మార్క్ దాటేసిందని టాక్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్.. వద్ద మొదటి రోజే.. రూ. 65 కోట్లకుపైగా వసూలు చేసిందని టాక్ నడుస్తోంది.
The Mighty # Beast takes an Humongous Opening, smashing all previous records
Unbelievable craze and collections Worldwide. Thank you one and all
— c.sembian sivakumar (@sembian_) April 13, 2022