Most Recent

Allu Arjun : భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. కారణం ఇదే

Allu Arjun

ప్రస్తుత, అల్లు అర్జున్( Allu Arjun )పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. పుష్ప సినిమాతో మొదటి సారి పాన్ ఇండియా ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన బన్నీ భారీ హిట్ ను అందుకున్నాడు. మొదటి పాన్ ఇండియా సినిమాతోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. పుష్ప సినిమాతో త్రూ అవుట్ వరల్డ్‌ విపరీతంగా పాపులర్ అయిన అల్లు అర్జున్ తాజాగా ఓ భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. కోట్లలో రెమ్యూనరేషన్ ఇస్తామని మేకర్స్ చెబతున్నా.. తను ఫాలో అవుతున్న వాల్యూస్‌కే కట్టుబడిపోయాడట బన్నీ. ప్రస్తుతం హీరోలంతా సినిమాలతో పాటు యాడ్స్ తో యూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా యాడ్స్ చేస్తున్నారు. అలంటి ఆఫర్ ఒకటి బన్నీ దగ్గరకు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పారట.

అసలు విషయం ఏంటంటే..! తాజాగా ఓ టొబాకో కంపెనీ అల్లు అర్జున్‌ను తన ప్రోడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలనుకుంది. అనుకోవడమే కాదు ఓ ఫ్యాన్సీ అమౌంట్‌ను కూడా మన ఐకాన్ స్టార్ కు ఆఫర్ చేసింది. ఊ అంటే ఓ లావిష్ సెట్లో ఓ క్రేజీ కాన్సెప్ట్ తో యాడ్ షూట్ చేసేందుకు కూడా రెడీ అయిపోయింది.అయితే ఈ ప్రాజెక్ట్ ను బన్నీ రిజెక్ట్ చేశారనే న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. టొబాకో ప్రోడక్ట్స్‌ను ప్రమోట్ చేయనిని..అది తన వాల్యూస్‌కు వ్యతిరేకం అని ఫీలైన బన్నీ.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ కంపెనీ క్రియేటివ్ టీంకు నో చెప్పారట.. మరో సారి అందరి మనసు గెలుచుకున్నారట.

మరిన్ని ఇక్కడ చదవండి :

Acharya: భలే భలే బంజారా రెస్పాన్స్ అదుర్స్.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న తండ్రికొడుకులు..

RRR Collections: జోరు తగ్గని ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ 2 పోటీని సైతం తట్టుకుని..

Siddu Jonnalagadda: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరో ?.. బడా ప్రొడ్యూసర్‏తో సిద్ధు జొన్నలగడ్డ..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.