Most Recent

Irumudi Movie: ‘ఇరుముడి’ సినిమాలో రవితేజ కూతురుగా నటించిన ఈ పాప ఎవరో తెలుసా? బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా

Irumudi Movie: ‘ఇరుముడి’ సినిమాలో రవితేజ కూతురుగా నటించిన ఈ పాప ఎవరో తెలుసా? బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు మాస్ మహారాజా, హీరో రవితేజ. ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ సీనియర్ హీరో. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. అయితే ఇప్పటివరకు తన కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలు చేసిన రవితేజ ఈసారి డిఫరెంట్ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఇరుముడి అనే ఓ డివోషనల్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడీ మాస్ మహారాజ. గతంలో మజిలి, నిన్నుకోరి వంటి ప్రేమకథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. . మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇరుముడి సినిమాలో రవిజేత కూతురిగా నక్షత్ర అనే ఓ చిన్నారి నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన కంటెంట్ లో రవితేజ తర్వాత ఆ పాపనే బాగా హైలెట్ గా నిలిచింది. చాలా క్యూట్ గా కనిపించింది. దీంతో ఈ పాప ఎవరా? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నక్షత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.

నక్షత్ర ఫ్యామిలీ కేరళ లోని కన్నూర్ కి చెందిన వారు. నక్షత్ర చిన్నప్పట్నుంచీ పలు యాడ్స్ లో నటించింది. అలాగే కేరళలో అనేక లోకల్ యాడ్స్ లో నటించింది. దీని తర్వాత మలయాళంలో రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నక్షత్ర నటించింది. ఇప్పుడు రవితేజ ఇరుముడి సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అవుతోంది. ఇరుముడి సినిమాతో పాటు నక్షత్ర చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కన్నడలో శివ రాజ్ కుమార్ డాడ్ సినిమాలో, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నోబడీ సినిమాల్లో నటిస్తోంది నక్షత్ర.

ఇరుముడి సెట్ లో రవితేజ, నక్షత్ర..

 

View this post on Instagram

 

A post shared by NAKSHATHRA… (@nakshathra__cm)

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది నక్షత్ర. ఈ పాపకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను వారి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలా పలువురు స్టార్ సెలబ్రిటీలతో నక్షత్ర దిగిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by NAKSHATHRA… (@nakshathra__cm)

 

View this post on Instagram

 

A post shared by NAKSHATHRA… (@nakshathra__cm)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.