
ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ హవా కనిపిస్తుంది. సినిమా సినిమాకు కొత్త అందాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయ. అంతే కాదు ఒకప్పుడు 10 సినిమా చేస్తే కానీ రాని క్రేజ్ ఇప్పుడు ఒకే ఒక సినిమాతో దక్కించుకుంటున్నారు. ఇలా ఓవర్ నైట్ స్టార్స్ గా మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న హీరోయిన్స్ 10 సినిమాలు చేస్తే గొప్ప అన్నట్టుగా మారిపోయింది. కొంతమంది ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అయ్యి ఆతర్వాత అవకాశాలు అందుకోలేక దూరం అవుతున్నారు. కానీ ఇప్పుడు ఓకే హీరోయిన్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో 9 సినిమాలు చేసింది. వాటిలో 5 సినిమాలు సూపర్ హిట్ అయ్యింది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.? రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె ఎవరో కాదు
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 2019లో ఓ హిందీ సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. ఆ తర్వాత 2021లో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇచటవాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తన నటనతో అందరి దృష్టి ఆకర్షించింది ఈ వయ్యారి.. ఆతర్వాత రవితేజ సినిమా ఖిలాడీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించి అందరూ షాక్ అయ్యేలా చేసింది. దాంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఆతర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ డేస్‌లోనే రవితేజ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం అందుకున్న ఈ బ్యూటీకి లక్కీ భాస్కర్ సినిమాలో లక్ కలిసొచ్చింది. దుల్కర్ సల్మాన్ నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో మీనాక్షికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన మట్కా, విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. కానీ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.ఆతర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా అనగనగ ఓ రాజు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ కుర్రభామ. మొత్తం తెలుగులో 9 సినిమాలు చేసిన ఈ చిన్నది 5 హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి