Most Recent

Thagubothu Ramesh: నన్ను చూసి ఏ ఊరు రా నీది అన్నాడు.. తాగుబోతు షాకింగ్ కామెంట్స్

Thagubothu Ramesh: నన్ను చూసి ఏ ఊరు రా నీది అన్నాడు.. తాగుబోతు షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమలో తన విలక్షణమైన శైలితో, ముఖ్యంగా తాగుబోతు పాత్రలతో ప్రేక్షకుల మన్నన పొందిన నటుడు తాగుబోతు రమేష్. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు తాగుబోతు రమేష్. గతంలో ఓ ఇంటర్వ్యూలో తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. తాను నటుడిగా అవకాశాల కోసం పెద్దగా కష్టపడలేదని, తన నటనకు ముగ్ధులై ఆఫర్లు ఇచ్చేవారని రమేష్ పలు సందర్భాల్లో వెల్లడించారు. తాను ఏ ఆడిషన్‌కు వెళ్లినా.., తన పర్ఫార్మెన్స్ చూసిన వెంటనే అందరూ షాక్ అయ్యేవారని, వేషాలు ఇచ్చేవారని ఆయన వివరించారు. చిన్నతనంలో పడిన కష్టాలు వల్లే భగవంతుడు తనకు ఈ అవకాశాలు ఇచ్చాడని ఆయన అన్నారు. ఆయన కెరీర్‌లో కీలక మలుపు దర్శకుడు కృష్ణవంశీతో మహాత్మ సినిమా కోసం జరిగిన ఆడిషన్. రమేష్ జగడం వంటి చిన్న సినిమాలు చేస్తూ.., పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న సమయంలో, కృష్ణవంశీ మహాత్మ సినిమా కోసం ఆడిషన్లు నిర్వహిస్తున్నారు.

ఇన్స్టిట్యూట్‌లో తన గురువుగా భావించే ఉత్తేజ్ ద్వారా కృష్ణవంశీకి పరిచయం అయ్యారు. కృష్ణవంశీకి రికమెండేషన్లు అంటే ఇష్టం ఉండదు కాబట్టి, రమేష్ పట్ల మొదట పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే, రమేష్ నటనను ధనరాజ్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా కృష్ణవంశీ చూసిన తర్వాత, ఆయన ప్రతిభను గుర్తించారు. తన నటనను చూసిన వెంటనే కృష్ణవంశీ “ఏ ఊరు రా నీది, నీ ఏజ్ ఎంత ఉంటుంది?” అని అడిగి ఆశ్చర్యపోయారని రమేష్ గుర్తుచేసుకున్నారు.

మహాత్మ సినిమా సెట్స్‌లో రమేష్ నటనకు అందరూ అవాక్ అయ్యారట. ప్రతిరోజు సెట్‌కు వచ్చిన రవితేజ, శ్రీకాంత్ వంటి వారందరూ రమేష్ నటనను చూసి అభినందించారు. ముఖ్యంగా బ్రహ్మానందం వంటి సీనియర్ నటుడితో కలసి నటించడం ఆయనకు మరచిపోలేని అనుభవం అని అన్నారు. బ్రహ్మానందం కొత్త నటులను అంత త్వరగా దగ్గరకు రానివ్వరని, ప్రోత్సహించరని భయపెట్టినా.., రమేష్ తన నటనతో ఆయనను ఆకట్టుకున్నారు. ఒక సన్నివేశంలో శ్రీకాంత్‌ను కొట్టే సీన్ జరిగినప్పుడు, రమేష్ బ్రహ్మానందం ముందు రెండు అడుగులు వేసి, ఒక డైలాగ్ చెప్పగా, బ్రహ్మానందం వెంటనే ఆపి “వంశీ, ఎవడ్రా వీడు? అదరగొడుతున్నాడు” అని కృష్ణవంశీతో అన్నారని రమేష్ తెలిపారు. ఆ రోజు నుండి బ్రహ్మానందం గారు తనను ఎంతగానో ప్రోత్సహించారని ఆయన చెప్పుకొచ్చాడు. తాగుబోతు రమేష్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంలో తన అద్భుతమైన నటనకు గాను నంది అవార్డును అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.