
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు దీపికా రంగరాజు. బ్రహ్మాముడి సీరియల్ ద్వారా తనదైన నటనతో తెలుగు అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. అయితే టీవీలో పలు షోలలో తన అల్లరితో, వాక్చాతుర్యంతో సందడి చేస్తుంది. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఆమె పంచుకున్న మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. సాధారణంగా సెలబ్రిటీల జీవితాలు అనగానే అందరూ లగ్జరీ, ఇళ్లు, కార్లు ఊహించుకుంటారు. కానీ, ఈ ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడిన మాటలు జీవితం అసలైన పరమార్ధాన్ని, ప్రాముఖ్యతను గుర్తుచేశాయి. ఇంటర్వ్యూలో భాగంగా “మీకు సడన్ గా ఒక కోటి రూపాయలు దొరికితే ఏం చేస్తారు?” అని అడిగిన ప్రశ్నకు దీపికా ఎంతో నిజాయితీగా సమాధానమిచ్చారు. తనకు చెన్నైలో ఒక సొంత ఇల్లు (Own House) కొనాలనేది పెద్ద కల అని ఆమె చెప్పారు.
అయితే, ప్రస్తుతానికి తనకు ఎలాంటి సొంత స్థలం కానీ, ఇల్లు కానీ లేవని ఆమె స్పష్టం చేశారు. “ఈ ప్రపంచంలో మనం పుట్టినప్పుడే భగవంతుడు లేదా ప్రభుత్వం మనకంటూ ఒక స్థలాన్ని కేటాయిస్తుంది. అది మరేదో కాదు… మనం చనిపోయిన తర్వాత స్మశానవాటికలో (Graveyard) లభించే ఆరు అడుగుల స్థలం (6 Feet / 36 Square Feet)” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. నేను కోట్లల్లో సంపాదించడంలేదు.. లక్షల్లోనే సంపాదిస్తున్నా. నాకు క్రేజ్, పాపులారిటీ బ్రహ్మముడి సీరియల్ వల్లే వచ్చింది అని అన్నారు. మనిషి బ్రతికున్నంత కాలం ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని కలలు కన్నా, చివరికి శాశ్వతంగా మనకంటూ మిగిలేది ఆ ఆరు అడుగుల నేల మాత్రమేనని ఆమె చాలా సరళంగా వివరించారు
ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు, ప్రేక్షకులు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని, జీవితంలో ఆస్తుల కంటే మనశ్శాంతి, బంధాలు ఎంత ముఖ్యమో దీపికా అందరికీ గుర్తుచేశారు. బ్రహ్మాముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ చెన్నై సుందరి.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..
దీపిక రంగరాజు పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..