
సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ కేవలం మన దేశంలోనే కాదు.. దేశవిదేశాల్లో ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ సినిమాల్లో ఎంతటి సూపర్ స్టార్‌డమ్‌ను అనుభవిస్తారో, నిజ జీవితంలో అంతకంటే నిరాడంబరంగా, సామాన్యుడిగా ఉంటారు. ఆయన సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ సంఘటన తరచు చర్చల్లో ఉంటుంది. ఇది ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని, వినయాన్ని చాటిచెప్తుంది. ఓసారి రజినీకాంత్ తన శివాజీ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన తర్వాత హిమాలయాలకు వెళ్లడం లేదా గుళ్లకు వెళ్లడం అలవాటు ప్రకారం ఓ దేవాలయాన్ని సందర్శించాలని అనుకున్నారు. అయితే, ఆయన సూపర్ స్టార్‌గా కాకుండా సాధారణ భక్తుడిగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, తన బౌన్సర్లను రావద్దని చెప్పారు. తెల్లటి పంచ, చొక్కా ధరించి, ఒంటరిగా ఆలయానికి వెళ్లారు. దైవ దర్శనం అనంతరం గుడి బయట మెట్లపై కాసేపు కూర్చున్నారు.
ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా
అదే సమయంలో అక్కడికి ఓ వృద్ధురాలు వచ్చింది. మెట్లపై కూర్చున్న వ్యక్తి రజినీకాంత్ అని ఆమెకు తెలియదు. తెల్ల పంచెలో, గెడ్డంతో ఉన్న ఆయన్ని చూసి ఎవరో పేదవాడు, బిచ్చగాడు అనుకుందట. ఆమె గుండెల్లో జాలి కలిగి. తన దగ్గర ఉన్న పది రూపాయల నోటును తీసి రజినీకాంత్ చేతిలో పెట్టింది. ఆ క్షణంలో రజినీకాంత్ ఎటువంటి కోపాన్నిచూపించలేదట. ఆ మహిళ ఇచ్చిన పది రూపాయలను ఎంతో ప్రేమగా, చిన్న నవ్వుతో రెండు చేతులతో స్వీకరించారు. ఆ తర్వాత రజినీకాంత్ మెట్లపై నుంచి లేచి తన కారు వైపు నడిచారు. ఆయన కోసం ఎదురుచూస్తున్న లగ్జరీ కారు, దాని వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, చుట్టూ గుమిగూడిన ప్రజలను చూసి ఆ వృద్ధురాలు ఒక్కసారిగా షాక్ అయింది. తాను బిచ్చగాడని అనుకుని పది రూపాయలు ఇచ్చింది సాక్షాత్తు సూపర్ స్టార్ రజినీకాంత్‌కే అని ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె రజినీకాంత్ దగ్గరికి పరుగెత్తుకెళ్లి, “నన్ను క్షమించండి, దయచేసి క్షమించండి, మీరు ఎవరో నాకు నిజంగా తెలియదు” అని వేడుకుందట.
ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది
అప్పుడు రజినీకాంత్ ఆ మహిళతో, “అమ్మా, మీరు నన్ను క్షమించమని అడగకండి. నిజానికి ఇది దేవుడే నాకు గుర్తు చేస్తున్న ఒక అద్భుతమైన పాఠం. నా అసలు స్వరూపం ఏంటో దేవుడు మీ ద్వారా నాకు తెలియజేశాడు. దేవుడి ముందు మనమందరం బిచ్చగాళ్లమే. ఆయన దర్బార్‌లో మన యోగ్యత, అంతస్తు, డబ్బు దేనికీ విలువ లేదు, అందరూ ఒక్కటే” అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “నాకు ఎలాంటి అహంకారం, గర్వం రాకుండా ఆపడానికే దేవుడు మీ ద్వారా నాకు సందేశం ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ 10 రూపాయలు నాకు కేవలం డబ్బు కాదు, ఇది సాక్షాత్తు భగవంతుడిచ్చిన ఆశీర్వాదం” అని వివరించారు. ఆ మహిళ ఇచ్చిన పది రూపాయల నోటును చివరి వరకు తన దగ్గరే భద్రపరుచుకుంటానని కూడా రజినీకాంత్ చెప్పారట. ఇప్పటికీ ఆ పది రూపాయల నోటు రజినీకాంత్ దగ్గర ఓ పవిత్రమైన జ్ఞాపకంగా ఉందని అంటుంటారు.
ఇది కూడా చదవండి : ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి