Most Recent

Ram Charan : స్టార్ డమ్ వదిలి ప్రజాసేవలోకి.. దళపతి విజయ్‏పై రామ్ చరణ్ ప్రశంసలు..

Ram Charan : స్టార్ డమ్ వదిలి ప్రజాసేవలోకి.. దళపతి విజయ్‏పై రామ్ చరణ్ ప్రశంసలు..

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇదివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. మరోవైపు యూట్యూబ్, సోషల్ మీడియాలో పెద్ది సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. పక్కా స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్టులో చరణ్ రగ్గడ్ లుక్ లో అలరించనున్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కొద్ది రోజులుగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తుంది పెద్ది టీమ్. శనివారం చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో పాల్గొన్న చరణ్ తమిళనాడు సీఎం దళపతి విజయ్ పై ప్రశంసలు కురిపించారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి విజయం సాధించిన విజయ్ దళపతిపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా విజయ్ కు అభినందనలు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయన సీఎం కావడం పట్ల గర్వంగా ఉందన్నారు చరణ్. అలాగే తమిళనాడు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

చరణ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం మేమంతా దాదాపు రెండున్నరేళ్లు కష్టపడ్డాం. మా దర్శకుడు బుచ్చిబాబు ఐదారేళ్లు కష్టపడ్డారు. ఈ చిత్రం కోసం మూడు ఆటలు ఆడడమే కాదు.. అందుకు తగ్గట్టు మారడం కూడా కష్టమే. కానీ బుచ్చి స్క్రిప్ట్ డిమాండ్ అలాంటిది మరీ. ఈ సినిమా చిత్ర పరిశ్రమ గర్వపడేలా చేస్తుంది. దీనిని తెలుగు వాళ్లలాగే తమిళ ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నా” అని అన్నారు. పెద్ది చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. దివ్యేందు శర్మ, జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

 

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.