
ఎప్పటిలాగే ఈ శుక్రవారం (మే 08) కూడా థియేటర్లలో పలు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, తిరువీర్ పాపం ప్రతాప్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుండగా శుక్రవారం (మే 08) అడివి శేష్ డెకాయిట్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. వీటితో పాటు ఒక మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మూవీ ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు ఒకేసారి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రావడం విశేషం. ఏప్రిల్ 2న మలయాళంలో రిలీజైన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఏకంగా రూ.230 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం విశేషం. దీంతో తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 26న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమాకు మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాను ప్రశంసించడం విశేషం. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఏ సినిమా గురించి మాట్లాడుతున్నామో?
ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా సంచలన విజయం సాధించిన మలయాళం సినిమా ‘వాలా 2′ బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్’ అనేది ఈ మూవీ క్యాప్షన్. దర్శకుడు సావిన్ ఎస్.ఏ తెరకెక్కించిన ఈ న్యూ ఏజ్ కామెడీ డ్రామాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు హషీర్, అలెన్, వినాయక్ ప్రధాన పాత్రలు పోషించారు. యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్ స్టార్ లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నలుగురు సామాన్య యువకుల జీవితాల్లోని ఒడిదుడుకులను, స్నేహాన్ని ఎంతో సహజంగా ఈ సినిమాలో చక్కగా చూపించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో మాత్రం అసలు వదిలిపెట్టద్దు.
జియో హాట్ స్టార్ లో వాలా 2 స్ట్రీమింగ్..
വാഴാനായി വീണ്ടും വാഴയെത്തി!
Vaazha II: Biopic of a Billion Bros is now streaming on JioHotstar.#Vaazha2 #JioHotstar #JioHotstarMalayalam #Vaazha #Comedy #Drama #MalayalamMovie #Friendship pic.twitter.com/AS9I08bFIL
— JioHotstar Malayalam (@JioHotstarMal) May 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..