
దేవర, వార్ 2 వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలకు తన సంగీతంతో ఊపిరి పోసిన రవి బ్రసూరే ఈ మూవీకి కూడా స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ క్రేజీ పాన్-ఇండియా విజువల్ వండర్ వచ్చే ఏడాది
జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ( మే 20) ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని డ్రాగన్ చిత్ర బృందం ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. సుమారు 4 నిమిషాలకు పైగా నిడివి ఉన్న గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ కనిపించినంత పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. బీజీఎమ్ కూడా అద్దిరిపోయిందన్న కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.
కాగా ఎన్టీఆర్ బర్త్‌డేకు సరిగ్గా 8 నిమిషాల ముందే, అంటే మే 19 రాత్రి 11:52 గంటలకు ‘గ్లింప్స్ ఆఫ్ డ్రాగన్’ పేరుతో సోషల్ మీడియా వేదికలతో పాటు, ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మిడ్‌నైట్ స్క్రీనింగ్స్ ద్వారా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో అర్ధరాత్రి నుంచే ఎన్టీఆర్ అభిమానులకు పండగ వాతావరణం మొదలైంది. డ్రాగన్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మేకర్స్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
Here’s the #DragonGlimpse taking you into its world and characters
Man of Masses @tarak9999 #PrashanthNeel @AnilKapoor @rukminitweets #BijuMenon @ravibasrur @bhuvangowda84 #Venkatachalapathi @peterheinoffl @chethanDsouza… pic.twitter.com/8nVKgSVZmr
— Mythri Movie Makers (@MythriOfficial) May 19, 2026
డ్రాగన్ మూవీ గ్లింప్స్ వీడియో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

