Most Recent

Nivetha Thomas: హీరోగా నివేదా థామస్ తమ్ముడు.. కటౌట్ అద్దిరిపోయింది.. సేమ్ టు సేమ్ అక్కలానే ఉన్నాడుగా..

Nivetha Thomas: హీరోగా నివేదా థామస్ తమ్ముడు.. కటౌట్ అద్దిరిపోయింది.. సేమ్ టు సేమ్ అక్కలానే ఉన్నాడుగా..

హీరోయిన్ నివేదా థామస్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె చిన్నతనంలోనే ఎందరో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది. కెరీర ప్రారంభంలో ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటించిన నివేద జెంటిల్మెన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాలోనే తన అందం, అభినయంతో కట్టి పడేసింది. ఆ తర్వాత నిన్ను కోరి సినిమాతో యూత్ కు ఫేవరెట్ గా మారిపోయింది. జై లవకుశ, 118, బ్రోచేవారెవరుఆరా, దర్బార్, వి, వకీల్ సాబ్, మీట్ క్యూట్, శాకిని డాకినీ, 35 చిన్న కథ కాదు వంటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిందీ అందాల తార. అయితే నివేద వెండితెరపై కనిపించి సుమారు మూడేళ్లు అవుతోంది. అయితే ఇప్పుడు నివేదా బాటలోనే ఆమె సోదరుడు నిఖిల్ థామస్ కూడా నడుస్తున్నాడు. హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు.

నిఖిల్ థామస్ హీరోగా నటిస్తోన్న సినిమా పేరు బెంగళూరు మహానగరంలో బాలక. ఈ సినిమాను మహీ, రాజశేఖర్ దర్శకత్వంలో సీహెచ్‌.వి. శర్మ, ఎమ్మెస్ఎన్‌ మూర్తి నిర్మిస్తున్నారు.ఇప్పటికే వరంగల్‌, హన్మకొండ పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. త్వరలోనే రెండో షెడ్యూల్‌ కూడా మొదలవుతుందని, దానితో సినిమా దాదాపు పూర్తవుతుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాలో నిఖిల్‌ థామస్ తో పాటు రఘు కారుమంచి, చిత్రం శ్రీను, ధనరాజ్‌ వినీత్‌, మహేంద్ర, అచ్యుత్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మహానగరంలో బాలక సినిమాలో నిఖిల్ థామస్..

 

View this post on Instagram

 

A post shared by Nikhil Thomas (@nikhilthomas_07)

ఇక నిఖిల్ థామస్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ ఉంది. అంతేకాకుండా చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తాడు. మరి అక్క నివేదా థామస్ లాగే సినిమాల్లో సక్సెస్ అవుతాడో ? లేదో ? చూడాలి.

నివేదా థామస్ తో నిఖిల్ థామస్..

 

View this post on Instagram

 

A post shared by Nikhil Thomas (@nikhilthomas_07)

 

View this post on Instagram

 

A post shared by Nikhil Thomas (@nikhilthomas_07)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.