
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2). గత ఏడాడి డిసెంబర్ లో వచ్చిన ధురంధర్ కు ఇది సీక్వెల్. మార్చి 19న థియేటర్లలోకి విడుదలైన ఈ మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. కలెక్షన్లలోసరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఏకంగా 1900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి ఎదురుచూపులకు తెరపడింది. ఎట్టకేలకు ధురంధర్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో శుక్రవారం (మే 15) అర్ధరాత్రి నుంచి ఈ బ్లాక్ బస్టర్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, కన్నడ తదితర భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ధురంధర్ 2 సినిమా కేవలం ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియన్ ఆడియెన్స్ ఈ సినిమా చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.
కాగా ‘Raw & Undekha’ అనే ట్యాగ్‌లైన్‌తో దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో ధురంధర్ 2 రన్ అవుతోంది.. అంటే థియేటర్లలో కట్ చేసిన సీన్లతో కలిపి అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ అవుతుందన్న మాట. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుంది. ఐబీ హెడ్ అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) ఒక ఖైదీని అండర్ కవర్ ఏజెంట్‌గా ఎలా మార్చారు? కరాచీ మాఫియా సామ్రాజ్యంలో అతడి ప్రయాణం ఎలా సాగిందనేది ఈ సినిమాలో చూడవచ్చు. స్పై యాక్షన్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ధురంధర్ 2 ఒక విజువల్ ఫీస్ట్ కానుంది.
ధురంధర్ ది రివేంజ్ సినిమాలో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించడంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం.
నెట్ ఫ్లిక్స్ లో ధురంధర్ 2 స్ట్రీమింగ్..
Dhurandhar 2 Uncensored Version Streams On Netflix Overseas; India Premiere On Jio Hotstar Tomorrow
#dhurandhar #Dhurandhar2 #ranveersingh pic.twitter.com/IsvQ7zNT3r
— Media Mic | Indian Cinema | Tollywood (@MMTollywood) May 14, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

