Most Recent

Allu Arjun: అల్లు అర్జున్‌కు జోడీగా స్టార్ బ్యూటీ.. ముచ్చటగా మూడోసారి బన్నీతో

Allu Arjun: అల్లు అర్జున్‌కు జోడీగా స్టార్ బ్యూటీ.. ముచ్చటగా మూడోసారి బన్నీతో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మొన్నటివరకు టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఇండియాను షేక్ చేసింది. విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది పుష్ప. ఆతర్వాత వచ్చిన పుష్ప 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాడు ఐకాన్ స్టార్. ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు బన్నీ. రాకా అనే ఆసక్తికర టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను అట్లీ హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి

అల్లు అర్జున్, అట్లీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటే మరో తమిళ్ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అల్లు అర్జున్. ఆ దర్శకుడే లోకేష్ కనగరాజ్. యాక్షన్ సినిమాలకు లోకేష్ పెట్టింది పేరు. అల్లు అర్జున్ తో లోకేష్ కాంబినేషన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : బాబోయ్.. ఇదెక్కడి రొమాంటిక్ సిరీస్ రా బాబు..! ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్

ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో 23వ సినిమా కాగా ఈ సినిమాలో బన్నీకి జోడీగా పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్, పూజా కాంబినేషన్ లో రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలా వైకుంఠపురంలో బన్నీ , పూజా కలిసి నటించారు. ఆతర్వాత ఇప్పుడు ముచ్చటగా మూడో సారి అల్లు అర్జున్, పూజా కలిసి నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఇది కూడా చదవండి : 14ఏళ్లకే ఎంట్రీ.. పెళ్ళైన దర్శకుడితో ఎఫైర్.. కట్ చేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని..

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.