హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్కే.. గతంలో హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ గురించి పెద్దగా బయటకు వచ్చేది కాదు.. కానీ ఇప్పుడు సినిమాలు స్పాన్ పెరిగిపోవడంతో రెమ్యునరేషన్స్ కూడా పెంచేస్తున్నారు ముద్దుగుమ్మలు. సినిమాలను బట్టి కొందరు రెమ్యునరేషన్స్ తీసుకుంటుంటే మరికొందరు మాత్రం స్టార్ డమ్ , క్రేజ్ ను బట్టి పారితోషం డిమాండ్ చేస్తున్నారు.
చాలా మంది భామలు ఇప్పుడు స్టార్ హీరోలతో పోటీపడుతూ రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు. కొంతమంది హీరోల కంటే ఎక్కువ తీసుకునే వారు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ తన తొలి సినిమాకు కేవలం లక్షరూపాయలు రెమ్యునరేషన్ మాత్రమే అందుకుంది. కట్ చేస్తే ఇప్పుడు రూ.10 వేలకోట్లకు యజమాని ఆ అమ్మడు..ఇప్పుడు సినిమాలు మానేసింది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల క్రేజ్ పెరిగిపోవడంతో హీరో, హీరోయిన్స్ ఒకేసారి ఐదు ఆరు భాషల్లో సినిమాలు చేస్తున్నారు.. పాన్ ఇండియా సినిమాల హడావిడి లేనప్పుడు చాలా మంది హీరోయిన్స్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసి అలరించారు. అలాంటి వారిలో ఆసిన్ ఒకరు. ఈ అమ్మడు తెలుగులో అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమాతో పరిచయం అయ్యింది.
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది. అయితే తొలి సినిమాకు ఆసిన్ రెమ్యునరేషన్ కేవలం లక్షరూపాయలు మాత్రమేనట.. తెలుగులో శివమణి, లక్ష్మీ నరసింహ, చక్రం, ఘర్షణ, అన్నవరం సినిమాలతో మెప్పించింది. అలాగే తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటించింది. ఇక హిందీలోనూ అడ్డుపెట్టి సత్తా చాటుకుంది.
మైక్రోమ్యాక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆసిన్. 2016లో అసిన్, రాహుల్ శర్మ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆసిన్ పూర్తిగా సినిమాలు మానేసింది. పూర్తి సమయం ఫ్యామిలీకే కేటాయించింది. ఆసిన్ భర్త వ్యాపారవేత్త కావడంతో వేలకోట్లకు అధిపతి.. పది వేలకోట్లకుపైగానే ఆయనకు ఆస్తులుంటాయట.. దాంతో ఆయన సామ్రాజానికి ఆసిన్ మహారాణి అయ్యింది.




