Most Recent

Chittibabu: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు కన్నుమూత

Chittibabu: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు కన్నుమూశారు. ఛాతి నొప్పిరావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో చిట్టిబాబు మృతిచెందారు అని వైద్యులు తెలిపారు. చిట్టి బాబు అసలు పేరు వరప్రసాద్. దర్శకుడిగా, నిర్మాతగా,నటుడిగా తన ప్రతిభను చాటుకున్నారు చిట్టిబాబు. చిట్టిబాబు మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ప్రముఖ దిగ్గజ రచయిత, ‘మహారథి’గా పిలవబడే త్రిపురనేని మహారథి కుమారుడిగా చిట్టి బాబు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కెరీర్ బిగినింగ్ లో తన తండ్రి వద్ద సహాయక దర్శకుడిగా పని చేసి సినిమా నిర్మాణంలోని మెళకువలను నేర్చుకున్నారు. 1984లో ‘సంతానం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు చిట్టిబాబు. ఆ తర్వాత వరుసగా నా పేరు దుర్గ, ప్రలయం, ప్రేమించి చూడు, రైతు భారతం వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే నటుడిగానూ మెప్పించారు.

1976లో ‘గరుడాచలం’ చిత్రంతో ప్రారంభమైన ఆయన నట ప్రయాణం ఇటీవలి కాలం వరకు కొనసాగింది. భైరవ ద్వీపం, దశావతారం వంటి సినిమాలతో పాటు రీసెంట్ మూవీస్ జాతిరత్నాలు, జాంబీరెడ్డి, దర్జా సినిమాల్లోనూ నటించారు చిట్టిబాబు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.