Most Recent

Dhurandhar: ‘ధురంధర్’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రాహుల్ గాంధీనా! అసలు విషయం ఏంటో తెలుసా?

Dhurandhar: ‘ధురంధర్’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రాహుల్ గాంధీనా! అసలు విషయం ఏంటో తెలుసా?

రణ్‌వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ధురంధర్’. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. రూ. 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు OTTలోకి వచ్చింది. లక్షలాది మంది ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో కూడా చూసేశారు. అలాగే, ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు నెటిజన్లు ‘ధురంధర్’ సినిమా క్రెడిట్ లిస్ట్ లేదా నేమ్ కార్డ్‌లో ఒక పేరు చూసి ఆశ్చర్యపోతున్నారు. సినిమా క్రెడిట్స్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాహుల్ గాంధీ పేరు ఉండడం సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా ఈ సినిమాను నిర్మించారా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు చాలామంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో మీమ్స్‌ను కూడా షేర్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. కానీ నిజం వేరే ఉంది. ధురంధర్ సినిమాకు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అసలు సంబంధమే లేదు. ఈ సినిమా క్రెడిట్స్‌లో కనిపించే ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాహుల్ గాంధీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ వేరు వేరు. అయితే ఇద్దరి పేరు ఒకటే కావడం ఈ గందరగోళానికి కారణమైంది.

‘ధురంధర్’ సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాహుల్ గాంధీ చాలా ఏళ్లుగా బాలీవుడ్‌లో ఉంటున్నాడు. ఆయనొక ప్రొఫెషనల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ‘ధురంధర్’ సినిమాకు పనిచేసిన రాహుల్ గాంధీ గతంలో కొన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేశారు. అక్షయ్ కుమార్ నటించిన ‘రుస్తుం’, మనోజ్ బాజ్‌పేయి నటించిన ప్రసిద్ధ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. ‘ఫర్జీ’ వెబ్ సిరీస్, షాహిద్ కపూర్ నటించిన ‘రాకెట్ బాయ్స్’ సిరీస్‌లకు కూడా ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.

గందరగోళానికి కారణమిదే..

‘ధురంధర్’ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి, జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్ ప్రధాన నిర్మాతలు గా వ్యవహరించారు. అలాగే ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ‘ధురంధర్’ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1400 నుండి 1500 కోట్లు సంపాదించింది. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.