
కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేసి మెప్పించారు. 500 పైగా సినిమాలు చేసి మెప్పించారు మోహన్ బాబు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు మోహన్ బాబు. ఇటీవల కన్నప్ప సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు మోహన్ బాబు. ప్రస్తుతం నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు మోహన్ బాబు. ఇదిలా ఉంటే మోహన్ బాబు కేవలం నటుడు మాత్రమే కాదు మంచి విద్యావేత్త కూడా.. శ్రీ విద్యానికేతన్ పేరిట పలు విద్యా సంస్థలను నెలకొల్పిన ఆయన భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే తన విద్యాసంస్థల్లో 25 శాతం మంది పిల్లలకు ఉచిత విద్య, ఫీజు రాయితీలతో చదివిస్తున్నారాయన.
సామాన్యులతో పాటు టాలీవుడ్ లో పలువురు ప్రముఖ నటుల పిల్లల్ని కూడా తన విద్యాసంస్థలో చదివించినట్లు మోహన్ బాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలా ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి తన స్కూల్లో చదువుకొని ఇప్పుడు తమిళంలో టాప్ హీరోయిన్ గా ఎదిగిందని, ఆమె పేరు గుర్తు రావటం లేదని ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇంతకు ఆయన ప్రస్తావించింది ఎవరి గురించో కాదట. ఇటీవలే రూ. 300 కోట్లతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ గురించినేట. టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె నే ఐశ్వర్య రాజేష్. సీనియర్ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి ఐశ్వర్య రాజేష్ కి స్వయానా మేనత్త అవుతుంది.
అయితే ఐశ్వర్య తండ్రి రాజేష్ ఆమె చిన్నతనంలోనే కన్నుమూశారు. దీంతో ఆమె తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్ లోనే విద్య నభ్యసించారట. ఆ తర్వాత చెన్నైకి వెళ్లిందట. కాగా ఐశ్వర్య కోలీవుడ్ లో టాప్ హీరోయిన గా ఎదిగింది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా రూ. 300 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంతో ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ చిన్నది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.