Most Recent

నాలుగు పేజీల డైలాగ్‌ను సింగిల్ టెక్‌లో చెప్పేశాడు.. ఆ హీరో పై గుణశేఖర్ ప్రశంసలు

నాలుగు పేజీల డైలాగ్‌ను సింగిల్ టెక్‌లో చెప్పేశాడు.. ఆ హీరో పై గుణశేఖర్ ప్రశంసలు

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించే సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒకప్పుడు గుణశేఖర్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇటీవలే ఆయన యుఫోరియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో ఆయన తెరకెక్కించిన సినిమాలు, అలాగే హీరోల గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా సైనికుడు సినిమా షూటింగ్ సమయంలో నటుడు మహేష్ బాబు చూపిన అద్భుతమైన డైలాగ్ డెలివరీ గురించి వివరించారు. సాధారణంగా మహేష్ బాబు షూటింగ్‌కు వచ్చాక డైలాగ్ పేపర్లు చూస్తారని, అయితే సైనికుడులోని ఒక సన్నివేశంలో సుమారు నాలుగు, ఐదు పేజీల పొడవైన డైలాగులు ఉన్నాయని గుణశేఖర్ తెలిపారు. గోపాలకృష్ణ గారు అద్భుతంగా రాసిన ఆ డైలాగ్‌లను మహేష్ రాత్రి చూసి, మరుసటి రోజు సెట్‌లో సింగిల్ టేక్‌లో, ఎటువంటి పొరపాటు లేకుండా చెప్పారని తెలిపారు గుణశేఖర్.

రెండు కెమెరాలు పెట్టి చిత్రీకరించిన ఆ సన్నివేశం సెట్‌లో ఉన్న అందరికీ గూస్‌బంప్స్ తెప్పించిందని, మహేష్ బాబు అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో చెప్పిన ఆ డైలాగులను ఇప్పటికీ ప్లే చేస్తుంటారని గుణశేఖర్ గుర్తు చేసుకున్నారు. సైనికుడు సినిమా యూ.ఎస్.ఏ.లో జరిగిన ప్రీమియర్ గురించి కూడా ప్రస్తావించారు. మహేష్ బాబుతో సహా చిత్ర బృందం అక్కడికి వెళ్లిన విషయాన్ని పంచుకున్నారు గుణశేఖర్. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్న ప్రాజెక్ట్ గురించి కూడా గుణశేఖర్ ప్రస్తావించారు. ఒక్కడు లేదా అర్జున్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో కథా చర్చలు నడిచాయని, జైభేరి కిషోర్ గారు నిర్మాతగా ఆరు నెలల పాటు చర్చలు జరిపినప్పటికీ, కథ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదని ఆయన తెలిపారు.

నటీనటుల కోసం కథలను తయారు చేయకూడదని, కథకు వారు సరిపోతారంటేనే అవి మెటీరియలైజ్ అవుతాయని గుణశేఖర్ అభిప్రాయపడ్డారు. చివరగా, రుద్రమదేవి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఒక్కడు తర్వాత తాను వెంటనే రుద్రమదేవి సినిమా తీయాలని భావించానని, తన బృందంతో కలిసి వరంగల్ కూడా వెళ్లానని, అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు వెనకాడారని తెలిపారు. తన విజన్‌ను నమ్మి అనుష్క శెట్టి రుద్రమదేవి కోసం చాలా కృషి చేశారని గుణశేఖర్ కొనియాడారు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, ఏనుగుపై కూర్చోవడం వంటి వాటికి ఆమె చాలా కష్టపడ్డారని, ఆ కత్తి తిప్పి తిప్పి ఆమె చేతి ఎముకకు సమస్య కూడా వచ్చిందని ఆయన వెల్లడించారు. ప్రమోషన్ల విషయంలోనూ అనుష్క ఎంతో ఓపిక చూపారని, రోజుకు పదిహేను ఇంటర్వ్యూలు అలసిపోకుండా ఇచ్చేవారని, ఈ తరం నటీనటులకు ఆ ఓపిక లేదని గుణశేఖర్ అన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh babu (@maheshbabu_fc)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.