
వారణాసి సినిమా ఈవెంట్ కోసం రాజమౌళి ఎంతో శ్రమించారు. ఈవెంట్ ను సక్సెస్ చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఆయన అనుకున్నట్లే ఈవెంట్ అంతా బాగా జరిగినప్పటకీ మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో జక్కన్న కాస్త ఫ్రస్టేషన్ అయ్యారు. ఇదే క్రమంలో దేవుళ్లపై తనకు నమ్మకం లేదంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే కొందరు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వారణాసి గ్లింప్స్ వీడియో లేట్ అయితే ఏకంగా దేవుడనే తప్పు పడతావా? అంటూ కొందరు రాజమౌళిపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు రాజమౌళి గాని వారణాసి ఈవెంట్ టీం గానీ అధికారికంగా స్పందించలేదు. అయితే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మాత్రం వారణాసి ఈవెంట్ వివాదంపై స్పందించాడు. ప్రియదర్శి హీరోగా వస్తున్న ప్రేమంటే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైపర్ ఆది హాజరయ్యారు. అతను మాట్లడుతూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు డైరెక్టర్లు, హీరోలపై ట్రోల్స్ చేయడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశాడు.
‘వారణాసి ఈవెంట్ లో రాజమౌళి దేవుడిని అవమానించలేదు. తన గ్లింప్స్ వీడియో కాస్త లేట్ అయిందని హనుమంతుడిపై అలిగాడు. అంతే తప్ప ఏ దేవుడిని అవమానించలేదు. సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా సినీ సెలబ్రిటీలను ట్రోల్ చేయాలనే వాళ్లు ఎక్కువైపోయారు. అందులో భాగంగానే రాజమౌళి ఏ పోస్టర్ వదిలినా దాన్ని ట్రోల్ చేసస్తున్నారు. సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ట్రోలింగ్, అల్లు అర్జున్ నవ్వితే ట్రోలింగ్, సాయి ధర్మ్ తేజ్ ఆక్సిడెంట్ వల్ల మాట్లాడలేకపోయినా ట్రోలింగ్, ప్రభాస్ గారి లుక్స్‌పై ట్రోలింగ్, రామ్ చరణ్ గారి ‘చికిరి’ సాంగ్‌పై కూడా ట్రోలింగ్, ఆఖరికి చిరంజీవిపై ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం అలవాటు అయింది. ఇలాంటివి తగ్గించుకోవాలి’ అని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. మరి దీనిపై సినీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ప్రేమంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది కామెంట్స్..
రాజమౌళి గారు ఆ రోజు హనుమంతుడిపై అలిగారే కానీ, అవమానించలేదు.
సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ట్రోలింగ్,
బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్,
అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్,
సాయి ధర్మ్ తేజ్ ఆక్సిడెంట్ వల్ల మాట్లాడలేకపోయినా ట్రోలింగ్,
ప్రభాస్ గారి లుక్స్‌పై ట్రోలింగ్,… pic.twitter.com/X9ED6IEUnU
— idlebrain.com (@idlebraindotcom) November 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.