
బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు తీవ్ర అస్వస్థత . గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో ధర్మేంద్రకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. షోలే, ఫూల్ ఔర్ పత్తర్, చుప్కే చుప్కే వంటి..బ్లాక్ బస్టర్ సినిమాల్లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ ప్రముఖులు ప్రార్ధనలు చేస్తున్నారు.
ధర్మేంద్ర శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ధర్మేంద్ర ఇద్దరు భార్యలు ప్రకాశ్ కౌర్, హేమమాలిని. బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తొలి భార్య సంతానం. అత్యంత ప్రాచుర్యం పొందిన ‘షోలే’లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమాతో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అలాగే అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.