Most Recent

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ రారాజే.. డార్లింగ్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పిన ఫౌజీ హీరోయిన్.. వీడియో వైరల్

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ రారాజే.. డార్లింగ్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పిన ఫౌజీ హీరోయిన్.. వీడియో వైరల్

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాలున్నాయి. అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. ఇందులో ముందుగా రిలీజయ్యే సినిమా ది రాజాసాబ్. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ అనే ఓ యాక్షన్ ఓరియంటెడ్ మూవీలోనూ నటిస్తున్నాడు డార్లింగ్. వీటితో పాటు ఫీల్ గుడ్ డైరెక్టర్ గా పేరున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇటీవలే ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. హీరో, హీరోయిన్లు ప్రభాస్, ఇమాన్వీ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇమాన్వి చేసిన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్ తమ కోసం ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించారని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ అందాల తార. మీ ఇంటి భోజనం తిని కడుపుతో పాటు గుండె కూడా ప్రేమతో నిండిపోయిందని క్రేజీ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. థ్యాంక్‌ యూ ప్రభాస్ గారు అంటూ ఇమాన్వి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రభాస్ చేయించిన వెరైటీ వంటకాలను ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా ఇప్పుడే కాదు గతంలోనూ సినిమాల షూటింగ్ సమయంలో స్వయంగా తనే ఇంటి నుంచి భోజనాలు తయారు చేయించి తెప్పిస్తున్నాడు ప్రభాస్. తన మూవీ షూటింగ్‌లో పాల్గొన్న అందరికీ కూడా కడుపునిండా భోజనం పెట్టి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇప్పుడు కూడా ఫౌజీ హీరోయిన్ కు తన ఇంటి ఆతిథ్యం రుచి చూపించాడు డార్లింగ్.

ఇమాన్వీ కోసం ప్రభాస్ తయారు చేయించిన వంటకాలు.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.