Most Recent

Chiranjeevi: రాంచరణ్ గురించి ఆసక్తికరమైన విషయం షేర్ చేసిన మెగాస్టార్.. అన్నం తినాలంటే?

Chiranjeevi: రాంచరణ్ గురించి ఆసక్తికరమైన విషయం షేర్ చేసిన మెగాస్టార్.. అన్నం తినాలంటే?

ఒకప్పుడు థియేటర్లలో ఈలలు కొట్టించిన మాస్ మాస్టర్‌పీస్‌లు మళ్లీ తెర మీద సందడి చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు వరుసగా రీరిలీజ్ అవుతూ మెగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’, ‘గ్యాంగ్ లీడర్’, ఇప్పుడు ‘కొదమసింహం’… రీరిలీజ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది.

90ల మాయ మళ్లీ స్క్రీన్‌పై కనిపిస్తుండగా కొత్త జనరేషన్ ఆశ్చర్యపోతోంది. టికెట్ రేట్లు పెరిగినా హౌస్‌ఫుల్ బోర్డులు… అదే మ్యాజిక్! ఈ ట్రెండ్ చూస్తే మరిన్ని సినిమాలు కూడా లైన్‌లో ఉన్నట్టున్నాయి. నాస్టాల్జియా ఇప్పుడు కలెక్షన్ల కరెన్సీగా మారింది. థియేటర్లు మళ్లీ 90ల్లోకి టైమ్ ట్రావెల్ చేస్తున్నాయి!

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమ సింహం సినిమా రీరిలీజ్కి సిద్ధమైంది. మెగాస్టార్ కెరీర్‌లో 150కి పైగా చిత్రాల్లో నటించగా వాటిలో అనేక బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి. 1990లలో విడుదలైన ‘కొదమసింహం’ ఆయన కెరీర్‌లో మరో మైలురాయి. ఈ కౌబాయ్ యాక్షన్ చిత్రం, కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ (1971) తర్వాత తెలుగులో వచ్చిన మరో సంచలన కౌబాయ్ మాస్టర్‌పీస్. ఈ సినిమా 35 ఏళ్ల తర్వాత, ఈ నెల 21న రీ-రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి తన స్పెషల్ వీడియో మెసేజ్ ద్వారా పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.

పాట పెడితేనే భోజనం..

విడుదల సమయంలో ‘కొదమసింహం’ భారీ హిట్. బాక్సాఫీస్ వద్ద 10 కోట్లు పైగా కలెక్ట్ చేసి, అప్పటి రికార్డులను బద్దలు కొట్టింది. చిరంజీవి తొలిసారి గడ్డం పెంచి, కౌబాయ్ లుక్‌లో నటించిన సినిమా చరిత్ర సృష్టించింది. మోహన్‌బాబు పోషించిన ‘సుడిగాలి’ పాత్ర చిరంజీవి ఫేవరెట్. ‘ఆ పాత్రకు మోహన్‌బాబు తప్ప మరెవరూ న్యాయం చేయలేరు’ అని చిరంజీవి స్వయంగా మోహన్బాబుని ప్రశంసించారు.

Kodamasimham

Kodamasimham

లెజెండరీ నటుడు ప్రాణ్‌తో కలిసి పనిచేయడం అదృష్టమని, ఆ సీన్స్ ఇప్పటికీ మర్చిపోలేనినని అన్నారు. కౌబాయ్ థీమ్ అప్పటి తెలుగు సినిమాలో అసాధారణం. చిరంజీవి మొదట అది సాహసమని అనుకున్నారట, కానీ కథ నచ్చి వెంటనే ఓకే చెప్పారట.

కొదమసింహం సినిమా రీరిలీజ్ సందర్భంగా విడుదల చేసిన ఒక వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘కౌబాయ్ సినిమాలు నాకు ఇష్టమే, కానీ ఇలాంటిది చేస్తానని ఊహించలేదు. చరణ్ భోజనం చేయాలంటే వాళ్లమ్మ ఈ క్యాసెట్ పెట్టాల్సిందే. ఈ సినిమా పాటలు పెడితే తప్ప తినేవాడు కాదు’ అంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రీ-రిలీజ్‌తో కొత్త తరానికి 90ల మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని అన్నారు చిరంజీవి. కొదమసింహం రీరిలీజ్ మెగా అభిమానులకు అదిరిపోయే మాస్ ట్రీట్ ఇచ్చేందుకు వచ్చేస్తోంది!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.