
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి.. హౌస్ లో రచ్చ చేస్తుంది ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సంజన. సినిమాల్లో రాణించిన సంజన బిగ్ బాస్ హౌస్ లోనూ చలాకీగా.. యాక్టివ్ గా ఉంటూ అందరిని ఆకట్టుకుంటుంది. హౌస్ లో అవసరమైనప్పుడు వాయిస్ కూడా రేజ్ చేస్తుంది. అలాగే టాస్క్ ల్లోనూ తన శక్తి మేర ఆడి విన్ అవుతుంది. అలాగే కొన్ని సార్లు ఎమోషనల్ అయ్యి కూడా ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. అంతో ఇంతో నెగిటివ్ ఉన్న కూడా సంజన కు చాలా వరకు పాజిటివ్ కూడా కుంది.. నామినేషన్స్ లో ఉన్నప్పుడు కూడా ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అవుతుంది సంజన. ప్రతివారం హోస్ట్ నాగార్జున వచ్చిన సమయంలో కూడా నాగ్ సంజన గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. హౌస్ లో అందరితో సరదాగా ఉండే సంజనకు ఈవారం హౌస్ లో అన్యాయం జరిగిందనే చెప్పాలి.
బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్ వస్తుందంటే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఎంతగా ఎదురుచూస్తారో బయటున్న ఆడియన్స్ కూడా అంతే ఆసక్తిగా చూస్తారు. శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అని అనౌన్స్ చేశారు. ఆతర్వాత హౌస్‌లో తమకి మోస్ట్ సపోర్టివ్ ఎవరు.. కిందకి లాగేదెవరు అనేది చెప్పాలి అని చెప్పారు నాగ్. దాంతో నలుగురు హౌస్‌మేట్స్ సంజన వల్ల తమ ఆట కిందకి పోతుంది అని చెప్పారు. దాంతో సంజన పై బిగ్ బాంబ్ పడింది. దాంట్లో ‘నో ఫ్యామిలీ వీక్’ అని రాసి ఉంది. అది చూడగానే సంజన బోరుమంది.
“సార్ నేను ఇంటికెళ్లిపోతాను సార్.. నా వల్ల కాదు.. నేను చచ్చిపోతా.. నో సార్ నేను వెళ్లిపోతా.. నాకు ఈ గేమ్ అంటే ఇష్టం అలానే మిమ్మల్ని ప్రతి వారం చూడటం ఇష్టం కానీ నేను ఇక ఉండలేను సార్.. వెళ్లిపోతా.. నేను రోజుకు ఆరుసార్లు ఏడుస్తున్నాను.. ఇక నా వల్ల కాదు సార్.. ప్లీజ్ నేను ఈషోకి గౌరవం ఇస్తున్నాను.. నాకంటే ఎక్కువగా గేమ్ ను ప్రేమించాను.. కానీ నేను ఉండలేను.. నేను అంత బ్యాడ్ ఎవరికీ ఇక్కడ చేయలేదు సార్” అంటూ ఏడ్చేసింది. దాంతో ఇది నా డెసిషన్ కాదమ్మా.. హౌస్ మేట్స్ డెసిషన్. నేను ఏం చేయలేనమ్మా అని చెప్పారు నాగ్. నన్ను ఇంటికి పంపించేయండి సార్.. నా వల్ల కాదు.. సారీ సార్.. ఇది నేను పొగరుతో చెప్పడం లేదు సార్.. అని చెప్పింది. ఇక కళ్యాణ్, భరణి పైకి లేచి మేము మా ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తాం సంజనకు ఆ ఛాన్స్ ఇవ్వండి అని అన్నారు. కానీ నాగ్ దానికి ఒప్పుకోలేదు. దీని పై నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. టీఆర్పీ కోసమే ఇలా చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.