Most Recent

Jailer 2: భర్త మరణంతో సినిమాలకు దూరం.. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు.. రజనీకాంత్ జైలర్ 2లో ఆ టాలీవుడ్ హీరోయిన్

Jailer 2: భర్త మరణంతో సినిమాలకు దూరం.. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు.. రజనీకాంత్ జైలర్ 2లో ఆ టాలీవుడ్ హీరోయిన్

రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా జైలర్. నెల్సన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ స్టార్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది.ఇప్పుడీ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. జైలర్ 2 తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కూడా నెల్సనే దర్వకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాతో ఒక ఫేమస్ హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. సుమారు 13 ఏళ్ల తర్వాత తమిళ సినిమాలో నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు మేఘనా రాజ్. పేరుకు కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ ముద్దుగుమ్మ పరిచయం. 2009లో అల్లరి నరేష్ హీరోగా నటించిన బెండు అప్పారామ్ ఆర్ఎంపీ సినిమాలో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. ఇదే ఆమెకు మొదటి సినిమా కావడం విశేషం. దీని తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన లక్కీ సినిమాలోనూ కథానాయికగా కనిపించిందీ అందాల తార. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది మేఘన రాజ్.

సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది మేఘన. కన్నడ యాక్షన్ హీరో చిరంజీవి సర్జాను ప్రేమించి పెళ్లి చేసుకుందీ అందాల తార. అయితే కరోనా కాలంలో 2020 జూన్ లో చిరంజీవి సర్జా గుండెపోటుతో కన్నుమూశాడు. అప్పటికే మేఘనా నిండు గర్భంతో ఉంది. భర్త మరణంతో కుంగుబాటుకు గురైన మేఘనా రాజ్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే ఇప్పుడు తిరిగి చిత్ర పరిశ్రమలో తిరిగి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. కుమారుడు ర్యాన్ కూడా పెద్దవాడు కావడంతో మళ్లీ కెమెరా ముందుకు రానుందని టాక్. ఈ క్రమంలోనే రజనీకాంత్ నటిస్తోన్న ‘జైలర్ 2’ తో రీ ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది.

మేఘనా రాజ్ లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Meghana Raj Sarja❤ (@megsarj)

2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సీక్వెల్ ‘జైలర్ 2’ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నటించడానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మేఘనకు ప్రధాన పాత్రను ఆఫర్ చేసినట్లు చెబుతున్నా మేఘన తమిళ సినిమాకు కొత్త కాదు. ఆమె గతంలో ‘కాదల్ సొన్న వందేన్’, ‘ఉయరధిరు 420’, ‘నంద నందిత’ వంటి తమిళ చిత్రాల్లో నటించింది. 2012 నుండి ఆమె ఏ తమిళ చిత్రంలోనూ నటించలేదు. ఇప్పుడు ఆమెకు మళ్ళీ తమిళ సినిమా ఆఫర్లు వచ్చాయని చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Meghana Raj Sarja❤ (@megsarj)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.