Most Recent

చిరంజీవి రికార్డును రెండు రోజుల్లో బీట్ చేసిన చరణ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తండ్రి కొడుకులు

చిరంజీవి రికార్డును రెండు రోజుల్లో బీట్ చేసిన చరణ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తండ్రి కొడుకులు

మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు. కొడుకుకు ఏ మాత్రం తగ్గకుండా మెగాస్టార్ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి రెండు సినిమాలు లైనప్ చేశారు. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇందులో ఆషిక రంగనాథ్, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓప్రాజెక్ట్ చేస్తున్నారు చిరంజీవి. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లతో మెగాస్టార్ చిరంజీవి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ మెలోడీ ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారడమే కాకుండా, తెలుగు పాటకు దేశవ్యాప్తంగా అరుదైన ఘనతను సాధించింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే, మీసాల పిల్ల యూట్యూబ్ మ్యూజిక్ ఇండియాలో టాప్ ప్లేస్ కు చేరుకుంది.

మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్ లో 50మిలియన్ వ్యూస్ సాధించింది. సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సాంగ్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బీట్ చేశారు. చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమా చేస్తున్న విషయం. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ కూడా రిలీజ్ చేశారు. చిక్కిరి చిక్కిరి అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్.. భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. కేవలం రెండు రోజుల్లోనే.. మీసాల పిల్ల సాంగ్ ను బీట్ చేసేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చికిరి చికిరి రీల్స్ కనిపిస్తున్నాయి. 35 గంటల్లో 50 మిలియన్లను క్రాస్ చేసింది. 50 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడానికి ‘మీసాల పిల్ల’ పాటకి 3 వారాలు పడితే, ‘చికిరి చికిరి’ సాంగ్ రెండు రోజుల్లోనే యాభై మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అయితే పెద్ది సాంగ్ నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు. పైగా అది వీడియో సాంగ్.. కానీ చిరంజీవి సాంగ్ తెలుగులోనే రిలీజ్ అయ్యింది. అది కూడా లిరికల్ వీడియో.. ఏది ఏమైనా తండ్రి కొడుకులు సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.