
టాలీవుడ్ లో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ తర్వాత రమేశ్ బాబు, మహేశ్ బాబు, సుధీర్ బాబు.. ఇలా చాలా మంది హీరోలు వచ్చారు. ఇక విజయ నిర్మల వారసుడిగా రంగ ప్రవేశం చేసిన నరేష్ వెర్సటైల్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కృష్ణ సోదరుడు ఆది శేషగిరి రావు పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అలాగే ఇప్పుడీ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు వస్తున్నాడు. హీరోగా అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అతను మరెవరో కాదు కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు అన్నయ్య దివంగత నటుడు రమేష్ బాబు కొడుకు జయకృష్ణ. ఘట్టమనేని జయకృష్ణ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.
బాలయ్యకు లవర్‌గా, తల్లిగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు అజయ్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో అజయ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న అజయ్ భూపతి మహాసముద్రం అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
7/జీ బృందావన్ కాలనీ సీక్వెల్‌లో హీరోయిన్ ఈమేనా..! అందం అదిరిపోయిందిగా..
ఆతర్వాత మంగళవారం అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. అజయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు జయకృష్ణను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడట అజయ్. ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలో దీని పై అధికారిక ప్రకటన విడుదల కానుందని అంటున్నారు. అలాగే హీరోయిన్ గా ఓ స్టార్ హీరోయిన్ కూతురు నటిస్తుందని కూడా టాక్ వినిపిస్తుంది.
పెళ్ళికి ముందే తల్లైంది.. కట్ చేస్తే విడాకులు.. ఇప్పుడు తనకన్నా 7ఏళ్ల చిన్నవాడితో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.