
సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో.. అంతే నష్టం కూడా ఉంటుంది.. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. కొంతమంది సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకొని.. సినిమాల్లో ఛాన్స్ లు కూడా సొంతం చేసుకున్నటున్నారు.. కేవలం సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు సీరియల్ బ్యూటీలు కూడా సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే ట్రోల్స్ బారిన పడిన వారుకూడా చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె వేసుకున్న డ్రస్ కారణంగా ఆ ముద్దుగుమ్మను ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు. తెలుగులో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అలాగే బిగ్ బాస్ షోలోనూ పాల్గొంది ఆ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఆమె మరెవరో కాదు టాలీవుడ్ సీరియల్ బ్యూటీ ప్రియాంక జైన్.. బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 తో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియాంక జైన్. విజేతగా నిలవకపోయినా తన ఆట, మాటతీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తోంది ప్రియాంక జైన్. కాగా ఈ అందాల తార నటుడు శివ్ కుమార్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ అమ్మడు తన డ్రస్ కారణంగా ట్రోల్స్ బారినపడింది.
రీసెంట్ డేస్ లో ప్రియాంక తన డ్రసింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడింది. గ్లామరస్ డోస్ పెంచి అభిమానులను కవ్వించింది ప్రియాంక.. తాజాగా తన డ్రసింగ్ పై వస్తున్న ట్రోల్స్ పై స్పందించింది ప్రియాంక. “నేను కూడా ట్రోల్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. నాపై వస్తున్న ట్రోల్స్ చూసి షాక్ అయ్యాను. ఎదో ప్రపంచం మొత్తం నా వల్లే ఆగిపోయినట్టు అందరూ నాపైన పిచ్చిపిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. నేను నటించిన క్యారెక్టర్‌లో ఉన్నంతసేపు మాత్రమే ఆ లుక్‌లో ఉంటాను. ఆ పాత్ర అయిపోయాక మళ్లీ అలాగే ఉండడం సాధ్యం కాదు. నేను ఒక యాక్టర్‌ను.. నాకు కూడా ఫ్రీడం ఉంది. నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవడంలో తప్పేముంది.? అని ప్రియాంక ప్రశ్నించింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. కొన్ని కామెంట్లు చూసి నా మీద నాకే అసహ్యం వేసింది. ఎందుకిలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు.. నన్ను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి శివ్. అలాంటివి పట్టించుకోవద్దు అంటూ నాకు దైర్యం చెప్పాడు అని తెలిపింది ప్రియాంక.
View this post on Instagram