Most Recent

Bigg Boss 9 Telugu: భరణి ఎలిమినేట్.. అతడి కోసం పవరాస్త్ర వాడిన ఇమ్మూ.. బోరున ఏడ్చిన దివ్య, తనూజ..

Bigg Boss 9 Telugu: భరణి ఎలిమినేట్.. అతడి కోసం పవరాస్త్ర వాడిన ఇమ్మూ.. బోరున ఏడ్చిన దివ్య, తనూజ..

బిగ్‌బాస్ సీజన్ 9 దీపావళీ ఎపిసోడ్ మరింత ఘనంగా జరిగింది. హీరోయిన్స్ శివానీ నాగరంమ, అప్సర రాణి, ఆనంది స్పెషల్ పర్ఫార్మెన్సులతో ఆకట్టుకున్నారు. అలాగే జటాధార సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్ప శిరోద్కర్ బిగ్‌బాస్ వేదికపై సందడి చేశారు. అలాగే హౌస్మేట్స్ తో కాసేపు సరదాగా ముచ్చటించారు. అలాగే కంటెస్టెంట్లను రెండు టీములుగా విడగొట్టిన నాగ్.. పలు టాస్కులు ఇచ్చారు. ఆ తర్వాత గెలిచిన టీంకు ఆడియన్స్ డిమాండ్ మేరకు కంటెస్టెంట్లకు ఫ్యామిలీ వీడియో కాల్స్ చూపించారు. సుమన్ శెట్టికి అతడి భార్య నుంచి.. సంజనకు ఆమె భర్త నుంచి వీడియో కాల్ మెసేజ్ వచ్చింది. ఇక తన పిల్లలను, భర్తను చూసి ఎమోషనల్ అయ్యింది సంజన. ఆ తర్వాత కంటెస్టెంట్లకు కొత్త బట్టలు బహుమతిగా అందించాడు నాగ్. అలాగే స్వీట్ ఫైట్ అనే టాస్క్ పెట్టగా.. ఇందులో స్వీట్ ను గెస్ చేసి పరుగెత్తుకెళ్లి తినాలి. ఇందులో సుమన్ శెట్టి టీం విన్ అయ్యింది. ఇక సెలబ్రెటీల ఆటపాటలతో సరదాగా సాగింది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

అదే సమయంలో నామినేషన్లలో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరినీ సేవ్ చేయగా.. చివరకు రాము రాథోడ్, భరణి మిగిలిపోయారు. అప్పటి నుంచి అటు దివ్య, తనూజ కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నారు. తనూజ ఏడుపు చూసి నాగార్జున ఆమెను కన్పెన్షన్ రూంకు పిలిపించి.. ఏమైందని అడిగారు. ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నా.. వాళ్ల వాయిస్ వినలేకపోయాను,.. ఇంట్లో నాన్న అనే బాండింగ్ భరణిగారితో ఏర్పడింది. కానీ అందరూ దాని గురించి చెప్పి నా గేమ్ స్పాయిల్ అవుతుందని చెప్పడంతో ఆయనతో వారం రోజులుగా సరిగ్గా మాట్లాడేలేపోయా.. అందరూ ఉన్న ఒంటరిని అనే ఫీలింగ్ కలుగుతుంది అంటూ ఏడ్చేసింది. ఇక రాము, భరణి ఇద్దరిని గార్డెన్ ఏరియాకు రమ్మని చెప్పిన నాగ్.. దీపావళి అయినా ఎలిమినేషన్ తప్పదని అన్నారు. హౌస్ లో ఒకరి దగ్గర పవరాస్త్ర ఉంది.. ఇమ్మాన్యుయేల్ దగ్గర ఉన్న ఆ పవరాస్త్రకు మూడు పవర్స్ ఉన్నాయి. అది ఉపయోగించవచ్చు రెండోసారి కొన్ని వారాల తర్వాత వాడొచ్చు..మూడోసారి మంకొన్ని వారాల తర్వాత వాడాలి.. ఈవారం పవరాస్త్రకి ఇస్తున్న పవర్ సేవింగ్ పవర్.. ఇప్పుడు సేవ్ చేస్తే మళ్లీ సేవ్ పవర్ ఇక ఉండదని చెప్పాడు.

ఇక ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ఆరు వారాలుగా రాము స్ట్రేట్ ఫార్వాడ్ గా ఉన్నాడు… కానీ మొదట 2 వారాల్లో కనిపించిన భరణి అన్న మళ్లీ కనిపించలేదు. బాండ్స్ లో ఇరుక్కుపోయినట్లు అనిపించింది.. అందుకే ఇది రాము కోసం ఉపయోగిస్తున్నా అని ఇమ్మూ చెప్పాడు. ఇక ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు లీస్ట్ లో ఉన్నారో చూద్దాం అని.. చూడగా.. భరణి, రాము ఎదురుగా ఉన్న క్రాకర్స్ వెలిగించాలని చెప్పాడు నాగ్. అది వెలిగి అందులో ఉన్న కలర్ మీరు ఎలిమినేటెడ్ లేదా సేఫ్ అని తెలుస్తుంది అని చెప్పాడు. ఇక రాము సైడ్ ఉన్న క్రాకర్ గ్రీన్ కలర్ రాగా.. భరణి సైడ్ రెడ్ కలర్ వచ్చింది. దీంతో భరణి ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. ఇక డోర్ ఓపెన్ కాగానే.. దివ్య వెళ్లి భరణిని హత్తుకొని ఏడ్చేసింది. అలాగే తనూజ సైతం భరణిని పట్టుకుని ఏడుస్తూనే ఉంది. స్టేజ్ మీదకు వచ్చాకా.. భరణి ఒక్కొ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడారు. ఇమ్మూ నీకు ఒక మాట చెప్పాను. ఆ మాట 100 శాతం పూర్తి చేస్తావని అనుకుంటున్నానని అన్నారు. ఇక చివరగా డీమాన్ గురించి మాట్లాడుతూ.. నా వల్ల హౌస్ లో ఎవరికైనా అన్యాయం జరిగింది.. నా వల్ల ఎవరికైనా పొరపాటు జరిగిందంటే అది నీకే డీమాన్. అందుకే కప్పు కొట్టి బయటకు రా.. సారీ.. ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.