Most Recent

Tollywood: ఐదేళ్లలో ఏకంగా 150 సినిమాలు.. విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కిన ఈ స్టార్ హీరో ఎవరో తెలుసా?

Tollywood: ఐదేళ్లలో ఏకంగా 150 సినిమాలు.. విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కిన ఈ స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఇప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా ఇస్తే చాలు అనే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక సినిమా, సినిమాకు మరింత గ్యాప్ తీసుకుంటున్నారు కథానాయకులు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఇదే పరిస్థితి. భారీ బడ్జెట్, మల్టీ స్టారర్స్, వీఎఫెక్స్ హంగులు, ప్రమోషన్స్.. ఇలా ఒక్కో సినిమా పట్టాలెక్కి షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పడుతుంది. అయితే గతంలో మాత్రం ఈ పరిస్థితి ఉండేది కాదు. స్టార్ హీరోల సినిమాలు రెగ్యులర్ గా రిలీజ్ అయ్యేవి. దీనికి ప్రత్యేక్ష ఉదాహరణ ఈ స్టార్ నటుడే. ఇప్పటికీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ హీరో గతంలో ఒకే ఏడాది 36 సినిమాలు రిలీజ్ చేసి చరిత్ర సృష్టించాడు.అంతేకాదు 4 ఏళ్ల వ్యవధిలో 139 సినిమాలు, ఐదేళ్ల వ్యవధిలో 150 సినిమాలు పూర్తి చేశాడు. ఇప్పటివరకు ఇండియాలో ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఒకానొకదశలో ఈ రికార్డుకు దగ్గరగా వచ్చినా అందుకోలేకపోయారు. 74 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేస్తోన్న ఈ నటుడి జీవితంఇప్పుడు పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కింది. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఈ హీరో సినిమా ప్రస్థానాన్ని ఇప్పుడు విద్యార్థులకు పాఠంగా చెప్పనున్నారు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా? మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.

మమ్ముట్టి పుట్టినరోజు నేడు (సెప్టెంబర్ 7). పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మమ్ముట్టికి ఇప్పుడు 74 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన సినిమా పనులు చేస్తున్నారు . 50 ఏళ్లుగా తిరుగులేని కెరీర్ తో 430కు పైగా సినిమాలతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి జీవితం
ఇప్పుడు పుస్తకాల్లో పాఠం కానుంది. కొచ్చిలోని మహారాజాస్ కాలేజీలో బీఏ హిస్టరీ చదువుతున్న విద్యార్థులు మమ్ముట్టి జీవితం, సినీ ప్రస్థానం, సినిమాపై అతని ప్రభావం గురించి అధ్యయనం చేస్తారు. ‘సెన్సింగ్ సెల్యూలాయిడ్: హిస్టరీ ఆఫ్ మలయాళీ సినిమా’ అనే ఛాప్టర్‌లో మమ్ముట్టి జీవితం, కెరీర్‌ను వివరంగా పొందుపరిచారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మమ్ముట్టి కూడా ఈ కాలేజీ విద్యార్థే.

 లేటెస్ట్ సినిమాలో మమ్ముట్టి..

 

View this post on Instagram

 

A post shared by Mammootty (@mammootty)

.
కాగా మమ్ముట్టికి క్యాన్సర్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లపై ఆయన ఇంకా స్పందించలేదు. మరోవైపు మమ్ముట్టి బాటలోనే ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ కూడా స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇటీవల కొత్త లోకా సినిమాతో నిర్మాతగా కూడా భారీ హిట్ కొట్టాడు. కల్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 

View this post on Instagram

 

A post shared by Mammootty (@mammootty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.