
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఓజీ ఫీవర్ తో ఊగిపోతున్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో భారీ తారాగణమే ఉంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఓమీ గా విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే సీనియర్ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డీజీ టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. కాగా ఓజీ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బాగా హైలైట్ అవుతోంది శ్రియా రెడ్డి. ఇటీవల జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నూ ఈ నటిపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఆమె ఫిట్ నెస్ లెవల్స్ చూస్తే మతిపోతుందని, ఆమెతో గొడవ పెట్టుకోవాలంటే ఎవరైనా ఆలోచించాల్సిందే అని పవన్ కొనియాడారు. మరి పవన్ కల్యాణ్ ప్రశంసలు పొందిన ఈ నటి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం రండి.
టీమిండియా మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తెనే శ్రియా రెడ్డి. భరత్ రెడ్డి 1978 నుంచి 1981 వరకు టీమిండియా క్రికెటర్ గా సేవలందించారు. అంతర్జాతీయ టెస్టులు, వన్డే మ్యాచ్ లు కూడా ఆడారు. ఇక క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన చెన్నైలో క్రికెట్ ట్రైనింగ్ క్యాంప్ లు నిర్వహిస్తున్నారు. దినేష్ కార్తీక్, లక్ష్మీ పతి బాలాజీ తదితర టీమిండియా క్రికెటర్లు భరత్ రెడ్డి కోచింగ్ లో రాటుదేలినవారే. ఇక శ్రియా రెడ్డి విషయానికి వస్తే.. మొదట వీజేగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బుల్లితెరకు పరిచయమైంది. ఆపై వెండితెరపై సత్తా చాటింది. తమిళ్ లో శ్రియా రెడ్డి నటించిన పలు సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. ముఖ్యంగా విశాల్ నటించిన పొగరు సినిమా శ్రియా రెడ్డిక మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. దీంతో పాటు తెలుగులో అమ్మ చెప్పింది, అప్పుడప్పుడు, సలార్ తదితర సినిమాల్లోనూ సందడి చేసిందీ అందాల తార.
ఓజీ సినిమాలో శ్రియా రెడ్డి..
View this post on Instagram
ఇక శ్రియా రెడ్డి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. పొగరు చిత్ర నిర్మాత, హీరో విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ ను ప్రేమించి వివాహం చేసుకుంది. 2008లో వీరి వివాహం జరిగింది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.