Most Recent

Mohanlal- Pawan Kalyan: అభినయంలో సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చే నటుడు మోహన్‌లాల్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Mohanlal- Pawan Kalyan: అభినయంలో సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చే నటుడు మోహన్‌లాల్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ కళామతల్లికి ఆయన సేవలను గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ మోహన్‌లాల్‌ కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందజేయనున్నట్లు శనివారం (సెప్టెంబర్ 20) కేంద్ర సమాచార, ప్రసారశాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మోహన్‌లాల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మోహన్ లాల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

‘ప్రముఖ నటులు మోహన్‌లాల్‌ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషకరం. మోహన్‌లాల్‌ కి హృదయపూర్వక అభినందనలు. అభినయంలో సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చే నటుడాయన. కథానాయకుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ఐదు జాతీయ అవార్డులు పొందారు. తెలుగులో ఆయన నటించిన సినిమాలు తక్కువేగానీ అనువాద చిత్రాల ద్వారా మన ప్రేక్షకులను మెప్పించారు. ఇద్దరు, కంపెనీ, తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ లాంటివి తెలుగు వారికి బాగా గుర్తుండిపోతాయి. మోహన్ లాల్ మరిన్ని విభిన్న పాత్రలు పోషించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ ట్వీట్..

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ, మోహన్ లాల్ స్నేహితుడు మమ్ముట్టితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సూపర్ స్టార్ కు అభినందనలు తెలియజేశారు.

ప్రధాని మోడీ అభినందనలు..

 

శశి థరూర్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.