Most Recent

Ghaati Movie Twitter Review : ఘాటి మూవీ ట్విట్టర్ రివ్యూ.. అనుష్క యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే..

Ghaati Movie Twitter Review : ఘాటి మూవీ ట్విట్టర్ రివ్యూ.. అనుష్క యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే..

ఒకప్పుడు సినీరంగాన్ని ఏలేసిన హీరోయిన్ అనుష్క శెట్టి. వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి చిత్రంతో అలరించింది. ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ బ్యూటీ.. ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సూపర్ హిట్ మౌత్ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఘాటి సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేస్తుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్కతోపాటు విక్రమ్ ప్రభు హీరోగా నటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఈరోజు (సెప్టెంబర్ 5న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

రివేంజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో అనుష్క గిరిజన మహిళగా కనిపించనుంది. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. చాలా కాలం తర్వాత ఫుల్ యాక్షన్ డ్రామాతో అనుష్క అదరగొట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. గతంలో అనుష్క, క్రిష్ కాంబోలో వచ్చిన వేదం సినిమా హిట్టు అందుకోవడంతో.. ఇప్పుడు మరోసారి వీరి కాంబోపై హైప్ నెలకొంది. ఈరోజు విడుదలైన ఘాటి సినిమాను చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఘాటి చిత్రం ఎలా ఉందో తెలుసుకుందామా.

ఘాటి సినిమా ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని.. యాక్షన్ సీన్లలో అనుష్క బీభత్సం సృష్టించిందని అంటున్నారు. చాలా కాలం తర్వాత తన రేంజ్ కు తగిన సినిమా చేసిందని అంటున్నారు. ఈ చిత్రంలో అనుష్క పాత్ర అద్భుతంగా ఉందని.. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో కాటేరమ్మ కొడుకును గుర్తుకు తెచ్చిందని టాక్. యాక్షన్ సీన్లలో అదరగొట్టేసిందని స్వీటీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.