Most Recent

రీతూ చౌదరి, డిమాన్ పవన్ మధ్య సంథింగ్ సంథింగ్.. పాప చూపులకే పడిపోయాడు

రీతూ చౌదరి, డిమాన్ పవన్ మధ్య సంథింగ్ సంథింగ్.. పాప చూపులకే పడిపోయాడు

మొన్నటివరకూ నామినేషన్స్ లో తెగ ఆర్చుకున్న హౌస్ మేట్స్ నిన్నటి ఎపిసోడ్ లో కాస్త శాంతించారు. నిన్నటి ఎపిసోడ్ లో ఓ లవ్ ట్రాక్ ను ప్రేక్షకుల కోసం వదిలారు. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది లవ్ ట్రాక్ నడిపారు. చాలా మంది ఆల్ మోస్ట్ ఒకరిని విడిచి ఒకరు ఉండాలరు అనేలా చేశారు కూడా.. రొమాంటిక్ మాటలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేసి చాలా మంది వార్తల్లో నిలిచారు. ఇక సీజన్ 9లో తాజాగా నయా లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆ జంట ఎవరో కాదు రీతూ చౌదరి, డిమాన్ పవన్. నిన్నటి ఎపిసోడ్ లో రీతూ చౌదరి గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటే.. అక్కడికి వచ్చిన పవన్ రీతూతో పులిహోర కలిపాడు. ఏంటి నువ్వూ మాట్లాడటం లేదు ఈమధ్య.. అని పవన్ అనగానే రీతూ తన చూపులతో మెంటలెక్కించేసింది.

ఆమె చూపులు మనోడికి ఎక్కడ తగలాల్లో అక్కడ తగిలాయి. ఇక చాలా సేపు ఈ ఇద్దరూ చూపులతోనే ఓ రొమాంటిక్ ట్రాక్ నడిపించారు. ఇక ఇద్దరూ రీతూ కొంటె చూపులతో కవ్విస్తుంటే పవన్ తెగ సిగ్గుపడిపోయాడు. నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని పవన్ అంటే.. ఎందుకు మాట్లాడాలి అంటూ క్యూట్ గా అడిగింది రీతూ.. హే… నేను నీ ఫ్రెండ్‌ని కాదా?? నీనంటే ఇష్టం లేదా? అంటూ మరింత పులిహోర కలిపాడు పవన్. దాంతో రీతూ తెగ నవ్వుకుంది.

ఇప్పుడు నేను మాట్లాడొద్దూ అంటే.. నువ్వు నాతో మాట్లాడవా?? అని రీతూ అంటే.. ‘అంతేగా.. అంటే నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదూ అని ఓ డైలాగ్ కొట్టాడు పవన్. ఏంటీ రీతూ.. నేను ఉదయం కనిపించకపోయే సరికికోపం వస్తుందా? నీకో విషయం తెలుసా రీతూ.. ఆ బ్లూ డ్రెస్ నీకోసమే వేసుకుని వచ్చా. కానీ నన్ను అస్సలు చూడలేదు. ఎంత ఫీల్ అయ్యానో.. ఆ డ్రెస్ నీకు ఇష్టం అనీ.. దాన్ని నువ్వు చూడాలని నీకోసమే వేసుకుని తిరుగుతున్నాను అంటూ ఇంటర్ నిబ్బా డైలాగ్స్ కొట్టాడు. ఆతర్వాత ఇద్దరూ చూపులతోనే చాలా సేపు మాట్లాడుకున్నారు. ఏ మాటకు ఆ మాట రీతూ వర్మ మాత్రం తన  చూపులతో తెగ కవ్వించింది గురూ..! ఇక పవన్ అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటే అక్కడికి వచ్చిన సంజన ఏంటీ పడిపోయావా? చూస్తున్నా చూస్తున్నా అనగానే మనోడు లోపల తెగ పొంగిపోయాడు. నేను అంత ఈజీగా పడను.. నాకు సింగల్‌గా ఉండటమే ఇష్టమే డైలాగ్ కొట్టాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.