Most Recent

Bigg Boss 9 Telugu: తొందరగా బయటికొచ్చెయ్.. శ్రష్టికి నాగార్జున బంపర్ ఆఫర్..

Bigg Boss 9 Telugu: తొందరగా బయటికొచ్చెయ్.. శ్రష్టికి నాగార్జున బంపర్ ఆఫర్..

బుల్లితెరపై బిగ్‏బాస్ సీజన్ 9 ఆట మొదలైంది. సెప్టెంబర్ 7న నాగార్జున గ్రాండ్ గా లాంచ్ చేశారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎంట్రీ ఇచ్చింది. ముందుగా లీకైనట్టుగానే ఈసారి కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. సూపర్ గ్లామర్ పెర్ఫార్మెన్స్ తో కాకుండా పద్దగా లంగావోణిలో ఎంతో అందంగా రెడీ అయింది. ఆ తర్వాత తన పాటకు మంచి పెర్ఫార్మెన్స్ కావాలని నాగార్జున అడగడంతో కన్నెపెట్టరో కన్నుకొట్టరో పాటకు స్టెప్పులేసింది. బిగ్‏బాస్ షోకు ఎందుకు రావాలనుకున్నావని నాగ్ అడగడంతో మోటివేషనల్ స్పీచ్ ఇచ్చింది. ఇక్కడ ఎంత ట్రై చేసిన ఎవరూ మాస్క్ వేసుకొని ఉండలేరని.. బయటపడాల్సిందే అని అందుకే ఇక్కడికి రావాలనుకున్నానని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..

జీవితంలో కఠిన పరిస్థితులు వచ్చినప్పుడే మనలోని ధైర్యం బయటకు వస్తుందని తెలిపింది. సోషల్ మీడియాలో కామెంట్స్, బయటివాళ్లు ఏమనుకుంటారు అనేది పట్టించుకోకూడదని.. తాను అస్సలు పట్టించుకోనని తెలిపింది. ఆ తర్వాత శ్రష్టి డ్యాన్స్ చూసి ఫిదా అయిన నాగార్జున ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నువ్వు తొందరగా బయటకు వచ్చేయ్ కలిసి పనిచేద్దాం అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‏కు ప్రపంచమే జై కొట్టింది..

శ్రష్టి విషయానికి వస్తే..
కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తొలినాళ్లలో పలు రియాల్టీ షోలలో కనిపించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫీ అందించింది. రంగస్థలం, పుష్ప, జైలర్, విక్రాంత్ రోనా వంటి చిత్రాలకు పనిచేసింది.

ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..

 

View this post on Instagram

 

A post shared by Shrasti Verma (@vermashrasti)

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.