Most Recent

Rajinikanth: ఇండస్ట్రీలో 50ఏళ్లు పూర్తి చేసుకున్న తలైవర్‌కు చంద్రబాబు, మోడీ స్పెషల్ విషెస్..

Rajinikanth: ఇండస్ట్రీలో 50ఏళ్లు పూర్తి చేసుకున్న తలైవర్‌కు చంద్రబాబు, మోడీ స్పెషల్ విషెస్..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కూలీ సినిమాలో ఎంతో మంది స్టార్ హీరోలు నటించారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ లో రజనీతో పాటు అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్.. ఇలా స్టార్ నటీనటులు ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషించారు. అలాగే అందాల భామ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరిసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో రిలీజ్ అయ్యింది కూలీ సినిమా. ఇక భారీ అంచనాల ,మధ్య విడుదలైన కూలీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది కూలీ సినిమా..

Chiranjeevi: అన్నయ్య నాకు దేవుడు.. లక్షరూపాయిల కోసం ఫోన్ చేస్తే కోటి ఇచ్చారు..

ఇక థియేటర్స్ లో భారీ ఓపినింగ్స్ తెచ్చుకుంది కూలీ సినిమా.. తొలి రోజే కలెక్షన్స్ తో నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా తొలి రోజే రూ. 151కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది. ఇండియాలోనే మొదటి రోజు రూ. 150 రాబట్టిన సినిమాగా కూలీ రికార్డ్ క్రియేట్ చేసింది. కూలీ సినిమా మంచిము విజయాన్ని సొంతం చేసుకోవడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సూపర్ స్టార్ కు అభినందనలు తెలుపుతున్నారు.

11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి 50ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా రిలీజ్ అయిన కూలీ మంచి విజయాన్ని అందుకోవడంతో సినీ ప్రముఖులంతా సూపర్ స్టార్ కు అభినందనలు తెలుపుతున్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రజినీకాంత్ కు అభినందనలు తెలిపారు. రజినీకాంత్ 50ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు చంద్రబాబు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ కు అభినందనలు తెలిపారు. చలనచిత్ర ప్రపంచంలో 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న రజినికాంత్కి గారికి శుభాకాంక్షలు. ఆయన ప్రయాణం చరిత్రాత్మక ప్రత్యేకత, ఆయన నటనలో అనేక పాత్రలు  ప్రజల మనస్సులలో చెరగని స్థానం సంపాదించుకున్నాయి. రజినీకాంత్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా.. అని మోడీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

చూస్తే దిమాక్ ఖరాబ్ అవ్వాల్సిందే..! వర్షాకాలంలో వేడిపుట్టిస్తున్న సినిమా.. ఒంటరిగా మాత్రమే చూడండి

నరేద్ర మోడీ విషెస్

నారా చంద్రబాబు విషెస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.