
టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా కొద్ దిరోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది.శివుని భక్తుడు భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ డివోషనల్ మూవీ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ కూడా ఓ స్పెషల్ రోల్ లో కనిపించాడు. ఈ క్రమంలోనే కన్నప్పలో అవ్రామ్ నటనకు గాను సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో తాజాగా అవార్డు దక్కింది. ఈ అవార్డుల వేడుకకు మంచు విష్ణు-వెరానికా దంపతులతో పాటు మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంచు విష్ణు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. అవ్రామ్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ.. మరోసారి మీ ముందుకు తప్పకుండా వస్తానని ఇందులో తెలిపాడు. అయితే మంచు విష్ణు షేర్ చేసిన వీడియోను మంచు మనోజ్ కూడా ట్విట్టర్ లో షేర్ చేశాడు. అంతేకాదు తన అన్నను ట్యాగ్ చేస్తూ .. ‘ అభినందనలు అవ్రామ్.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎప్పటికీ ఇలాగే మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలి నాన్నా. ప్రత్యేకంగా నువ్వు విష్ణు అన్నతో పాటుగా నాన్నగారు మోహన్‌బాబుతో అవార్డు అందుకోవడం చాలా స్పెషల్..’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ను చూసిన మంచు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘రక్త సంబంధం అలాంటిది’.. ‘అన్నదమ్ములిద్దరూ కలిసి పోయినట్టే’ అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా కన్నప్ప విడుదల సమయంలో కూడా సినిమా చూసిన మనోజ్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. సినిమా చాలా బాగుందని తాను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్చిందని చెప్పాడు. కన్నప్పలో తన అన్న మంచు విష్ణు ఇంత బాగా నటిస్తాడని అనుకోలేదని ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడు మరోసారి మంచు విష్ణు పేరు కోట్ చేస్తూ మనోజ్ పోస్ట్ పెట్టడంతో ‘భయ్యా.. అంతా సర్దుకున్నట్టే’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో..
Congratulations Avram
…..so so proud of you my boy…. Keep shining nannaaaa
This is so special with @IvishnuManchu anna and Nanna @themohanbabu garu also receiving this award …Lots of love#SantoshamFilmAwards https://t.co/2IPOHHDRmN
— Manoj Manchu
(@HeroManoj1) August 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..