Most Recent

CM Chandrababu: బాలకృష్ణ సినిమాకు జాతీయ అవార్డ్.. సీఎం చంద్రబాబు అభినందనలు..

CM Chandrababu: బాలకృష్ణ సినిమాకు జాతీయ అవార్డ్.. సీఎం చంద్రబాబు అభినందనలు..

కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.2023 సంవత్సరానికి గానూ ఈ అవార్డులను ప్రకటించింది కేంద్రం. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన భగవంత్‌ కేసరి మూవీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్‌కిగానూ హనుమాన్ సినిమా.. అలాగే ఉత్తమ స్క్రీన్‌ ప్లే- బేబీకి గానూ రాజేష్‌ నీలం, పార్కింగ్‌కి గానూ రామ్‌కుమార్‌ను అవార్డులు వరించాయి. బెస్ట్ లిరిక్స్ – బలగం సినిమాలోని ఊరూ.. పల్లెటూరు పాటకి గానూ కాసర్ల శ్యామ్‌కి దక్కింది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా సార్‌ సినిమాకి మ్యూజిక్ అందించిన జీవీ ప్రకాష్‌ ఎంపిక కాగా.. బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా గాంధీతాత చెట్టు సినిమాలో నటించిన డైరెక్టర్‌ సుకుమార్‌ కూతురు సుకృతి వేణికి జాతీయ అవార్డ్ వరించింది.

ఉత్తమ సింగర్‌, మేల్‌ – బేబీ సినిమాకు గాను.. ప్రేమిస్తున్నా పాట పాడిన PVSN రోహిత్‌కు అవార్డు దక్కింది. ఉత్తమ సింగర్‌, ఫిమేల్‌ – జవాన్‌ సినిమాలో చెలియా పాట పాడిన శిల్పారావు ఎంపికయ్యారు. 15 విభాగాల్లో జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం… రాష్ట్రపతి చేతులు మీదగా అందజేయనుంది.

జాతీయ అవార్డ్ గ్రహీతలకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా టీంకు శుభాకాంక్షలు తెలిపారు. “71వ జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలకు హృదయపూర్వక అభినందనలు. జాతీయ ఉత్తమ నటులుగా ఎంపిక అయిన షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాసే (12th ఫెయిల్), జాతీయ ఉత్తమ దర్శకుడు సుదీప్తో సేన్ (కేరళ స్టోరీ), జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (వాతి) లకు ప్రత్యేక అభినందనలు. తెలుగు చలన చిత్ర సీమకు సంబంధించి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన భగవంత్ కేసరి చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి అభినందనలు. జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ క్యాటగిరిలో ఎంపిక అయిన హనుమాన్ చిత్ర బృందానికి, జాతీయ ఉత్తమ పాటగా ఎంపిక అయిన ఊరూ పల్లెటూరు (బలగం) గాయనీగాయకులకు, గీత రచయితకు, జాతీయ ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్ సాయి రాజేష్ (బేబీ)కు, జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడు పి.వి.ఎన్.ఎస్.రోహిత్ (బేబీ)కు అభినందనలు.” అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.