
టాలీవుడ్ లో సత్తా చాటుతోన్న మలయాళ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందినదే. బాలనటిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత హీరోయిన్‌గానూ సక్సెస్ అయ్యింది. పేరుకు మలయాళీ అయినా తెలుగులోనే ఈ అందాల తారకు క్రేజ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని తదిదర స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె నటించిన 35 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆమె నటన నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి పాత్రల్లో నటించిన ఈ అందాల తార తొలిసారిగా అమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది.
ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..
తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు ఇటీవల 35 చిన్న కథ కాదు సినిమాతో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకున్న నివేదా థామస్. సోషల్ మీడియాలో తన క్యూట్ ఫొటోలతో మెప్పిస్తుంది.
యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..
1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించిన నివేదా.. 2002లో మలయాళం మూవీ ‘ఉత్తర’లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సన్ టీవీలో అప్పట్లో ప్రసారమైన మై డియర్ భూతం సీరియల్లోనూ నివేద నటించింది. ఆ తర్వాత తమిళ్, మలయాళంలో అనేక చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్, మీట్ క్యూట్, శాకిని డాకిని, 35 చిత్రాలతో తెలుగు ఆడియెన్స కు బాగా చేరువైంది.
అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి