
శ్రీమహాలక్ష్మి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది అంతలా తార పూర్ణ.. ఈముద్దుగుమ్మ అసలు పేరు షమ్నా కాసిమ్.. సినిమాల్లోకి వచ్చాక పూర్ణగా మార్చుకుంది. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. సీమ టపాకాయ్, అవును తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గానే కాకుండా దసరా, అఖండ, డెవిల్ తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించింది. అలాగే పలు టీవీ షోల్లోనూ మెరిసింది.దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పెళ్లి పీటలెక్కంది పూర్ణ. 2022 జూన్ 12న దుబాయిలోనే తన పెళ్లి జరిగినట్లు ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది పూర్ణ. ఆ తర్వాత 2023 ఏప్రిల్‌లో హమ్దాన్ అసిఫ్ అలీ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ.
పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా
ఇక ఇప్పుడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది పూర్ణ… రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇటీవలే పూర్ణ సినిమా షూటింగ్స్ కారణంగా తనకు దూరంగా ఉంటుందని భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా భార్య 20 రోజులు చెన్నైలో, 15 రోజులు మలప్పురంలో, ఆ తర్వాత జైలర్ 2 మూవీ కోసం అక్కడ తనింట్లో ఉంది. అంటే మొత్తం 45 రోజులు నాకు దూరంగా ఉంది. పెళ్ళైన ఇన్నేళ్ళలో మేము ఎప్పుడూ ఇంత దూరంగా లేము అంటూ ఎమోషనల్ పోస్ట్ చెప్పాడు పూర్ణ భర్త.
ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే
తాజాగా సోషల్ మీడియాలో పూర్ణ రెండో బిడ్డ రాబోతుందని అనౌన్స్ చేసింది. ఈ గుడ్ న్యూస్ తో మా గుండెల్లో సంతోషం నిండిపోయింది. మా ఫ్యామిలోకి మరొకరు రానున్నారు. కొత్త నవ్వులు, చిన్ని అడుగుజాడలు మా జీవితాల్లోకి రానున్నాయి. ఈ గుడ్ న్యూస్ మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ పూర్ణ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. పూర్ణ పోస్ట్ పై అభిమానులు, నెటిజన్స్ ఆమెకు విషెస్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలో కంటే ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించేసింది పూర్ణ. ఆ మధ్యన గుంటూరు కారంలో నటించిన ఈ అందాల తార ప్రస్తుతం ఎక్కువగా టీవీ షోల్లోనే కనిపిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది.
వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి