
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సూపర్ హిట్ మూవీ అతడు రీ రీరిలీజ్ అయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో కంటే టీవీలో ఎక్కువగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇది కూడా చదవండి : నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు
తాజాగా విడుదలైన ఈ సినిమా రీ రిలీజ్ అవ్వడంతో థియేటర్స్ లో ఫ్యాన్స్ ఈ సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. థియేటర్స్ దద్దరిల్లాయి.. థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో మహేష్ బాబుకు త్రిష తన స్నేహితులను పరిచయం చేస్తుంది. అందులో ఓ అమ్మాయి.. ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? 3క్లాసులో నాకు కొబ్బరుండ ఇచ్చి ముద్దుపెట్టావ్.. గుర్తులేదా..? నేను పార్థు నీ పద్దుని” అంటూ సిగ్గుపడుతూ చెప్తుంది..
ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా
అయితే ఆ పద్దు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంది. ఆమె పేరు సుహాసిని. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. తాజాగా మహేష్ అతడు రీ రిలీజ్ లో సందడి చేసింది. థియేటర్ లో తన సీన్ ను చూస్తూ డైలాగ్ చెప్పి ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో ఓ లుక్కేయండి.
ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి