Most Recent

Thammudu Twitter Review: తమ్ముడు ట్విట్టర్ రివ్యూ.. నితిన్ సినిమా పై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

Thammudu Twitter Review: తమ్ముడు ట్విట్టర్ రివ్యూ.. నితిన్ సినిమా పై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

చాలా కాలంగా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నారు హీరో నితిన్. కొన్నాళ్లుగా ఆయన నటించిన ప్రతి సినిమా డిజాస్టర్ అవుతూనే ఉంది. ఇక ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన రాబిన్ హుడ్ సైతం మిశ్రమ స్పందన అందుకుంది. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్టుకొట్టాలని చూస్తున్నాడు నితిన్. ఇప్పుడు తమ్ముడు సినిమాపై ధీమాగా ఉన్నాడు. ఇదివరకు విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి ఈ సినిమాపై ఆసక్తిని మరింత రేకెత్తించారు మేకర్స్. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సప్తమీ గౌడ, వర్ష బొలమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీనియర్ లయ కీలకపాత్ర పోషిస్తుండగా.. చాలా కాలం తర్వాత తమ్ముడు మూవీతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు లయ. తాజాగా శుక్రవారం (జూలై 4)న ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. మరీ ఇప్పుడు ఈ సినిమాకు సోషల్ మీడియాలో ఎలాంటి టాక్ వస్తుందో చూద్దామా.

నితిన్ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. విలువలతోపాటు మంచి ఎమోషనల్ రైడ్ పంచే సినిమా అని.. ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఈ సినిమాలో నితిన్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారని.. దర్శకుడు శ్రీరామ్ వేణు కథను చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా హ్యాండిల్ చేశారని.. బీజీఎమ్ బాగుందని అంటున్నారు. ఇక లయ, సప్తమీ గౌడ, వర్ష బొలమ్మ యాక్టింగ్ బాగుందని అంటున్నారు.

ఇక కొందరు ఫస్ట్ హాప్ ఓకే కానీ.. సెకండాఫ్ మాత్రం సెట్ చేసి పెట్టుకున్నారని అంటున్నారు. తెల్లవారుజామున నుంచే నితిన్ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాకు పూర్తి రివ్యూస్ రావాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.