Most Recent

8 Vasanthalu: సూర్య, దీపికతో కలిసి 8 వసంతాలు చేద్దామనుకున్నా.. డైరెక్టర్ ఫణింద్ర నర్సెట్టి..

8 Vasanthalu: సూర్య, దీపికతో కలిసి 8 వసంతాలు చేద్దామనుకున్నా.. డైరెక్టర్ ఫణింద్ర నర్సెట్టి..

8 వసంతాలు.. అందమైన ప్రేమకావ్యం. మలయాళీ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. జూన్ 20న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్, డైలాగ్స్, బీజీఎమ్, అనంతిక యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలోని కవిత్వం, భావుకత పుష్కలంగా ఉన్న ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చేసింది. ప్రతి అమ్మాయి, అబ్బాయి చూడాల్సిన సినిమా అంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత పలు కాంట్రవర్సీ కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 8 వసంతాలు సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

8 వసంతాలు సినిమా విడుదలైన తర్వాత మళ్లీ హీరోయిన్ తో మాట్లాడలేదని.. ఆమెతో ఎక్కువగా మాట్లాడే సందర్భాలు నాకు ఎప్పుడూ రాలేదని అన్నారు ఫణీంద్ర. సినిమా తర్వాత ఆమె కేరళకు వెళ్లారని..మాట్లాడేందుకు ఫోన్ చేసిందని.. ఆరోగ్యం బాగా లేక మాట్లాడలేకపోయానని అన్నారు. ఈ సినిమాను ముందుగా స్టార్ క్యాస్టింగ్ తో చేద్దామని మైత్రి వద్దకు వెళ్లానని.. దీపిక పదుకొణె, సూర్య లాంటి వాళ్లతో చేయాలనే ఉద్దేశంతోనే అంత డెప్త్ ఉన్న డైలాగ్స్ రాసుకుని వెళ్లానని.. కానీ అక్కడకు వెళ్లాకే పరిస్థితి మారిందని అన్నారు.

కొత్త వాళ్లతో చేస్తే బాగుంటుందని.. పెద్ద వాళ్లు అంటే ఇబ్బంది కలగొచ్చు.. అవసరమా ? అని మైత్రి వాళ్లు అన్నారని.. అందుకే అనంతిక, మధురం ఫేమ్ రవి, హను రెడ్డి వంటి వారితో తీశానని ఫణీంద్ర చెప్పుకొచ్చారు. తనకు ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇబ్బందిలేదని ఫణీంద్ర తెలిపారు. తన వద్ద ఉన్న డబ్బునే తాను ఇన్వెస్ట్ చేశానని… అదే ఇప్పుడు తనను కాపాడుతోందని అన్నారు.. అలా తానేమి ట్రేడింగ్ చేయానని అన్నారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.