Most Recent

Allu Arjun: ‘నీ యాంకరింగ్ రప్పా రప్పా’.. నాట్స్ వేదికగా బన్నీ ప్రశంసలు.. గాల్లో తేలిపోతున్న తెలుగు యాంకర్

Allu Arjun: ‘నీ యాంకరింగ్ రప్పా రప్పా’.. నాట్స్ వేదికగా బన్నీ ప్రశంసలు.. గాల్లో తేలిపోతున్న తెలుగు యాంకర్

టంపాలో జరిగిన NATS 2025 వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఆయన రాకతో అదొక చరిత్రలా మారిపోయింది. అల్లు అర్జున్ రాకతో ఖండాలు, భాషలు, సంస్కృతులలో, సరి హద్దుల్ని దాటుతూ ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ప్రజలకు అల్లు అర్జున్ కేవలం ఒక స్టార్ కాదు.. ప్రతీ కుటుంబంలోని ఓ వ్యక్తి.. తెలుగు వారి గుర్తింపు.. తెలుగు వారి గర్వం. NATS 2025 కేవలం ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇదొక ఎమోషనల్ ఈవెంట్‌గా సాగింది. తెలుగు వారి ప్రైడ్‌గా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులకు మించి విస్తరించి ఉన్న తెలుగు సమాజాన్ని ఎలా ఏకం చేసిందో టంపా చూసింది. ఇది ప్రపంచ వేదికపై తెలుగు వారికి గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన, ప్రేమించబడే, అనుసరించే తెలుగు నటుడు అల్లు అర్జున్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు విశ్వవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన విజయానికి చిహ్నంగా, తెలుగు గుర్తింపునకు ఒక వెలుగుగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు గర్వానికి నిజమైన చిరునామాగా మారారు. విదేశాల్లో నివసించే తెలుగు కుటుంబాలకు NATSలో అల్లు అర్జున్‌ను చూడటం అంటే ఒక నటుడిని కలవడం కాదు. వారి మూలాలు, వారి భాష, వారి సంస్కృతితో తిరిగి కనెక్ట్ అవ్వడంతో సమానం. జీవితం వారిని ఎక్కడికి తీసుకెళ్లినా తమ హృదయాలలో తెలుగు స్ఫూర్తిని కలిగి ఉంటారని గుర్తుచేసిన క్షణం ఇది.

ఈ సందర్భంగా ‘ఇండియన్స్‌ ఎక్కడున్నా తగ్గేదేలే.. అందులో తెలుగువాళ్లయితే అస్సలు తగ్గేదేలే..’, ‘తెలుగోళ్లంటే ఫైర్‌ అనుకున్నారా? వైల్డ్‌ ఫైర్‌’ అని డైలాగ్స్‌ చెప్పాడు. ఇక చివర్లో యాంకర్‌ శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. మీ యాంకరింగ్‌ మాత్రం రప్పా రప్పా అని పొగిడేశాడు.

నాట్స్ లో అల్లు అర్జున్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ కుమార్ డైరెక్షన్ లో ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సుమారు రూ. 800 కోట్లతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.