
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న చాలా మంది గతంలో చిన్న చితకా పనులు చేసిన వారే. కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వారే. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ అందాల తార తన 15 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది. దీంతో కుటుంబ పోషణ కోసం ఓ రిసెప్షనిస్ట్ ఉద్యోగంలో చేరింది. అయితే నటనపై ఆసక్తితో మొదట సీరియల్స్ లో అదృష్టం పరీక్షించుకుంది. అలా 17 ఏళ్ల వయసులో కెమెరా ముందుకు వచ్చింది. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ, యే హై మొహబ్బతేన్, నాగిని వంటి బ్లాక్‌బస్టర్ సీరియల్స్‌తో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అదే సమయంలో తెలుగు సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటించడంతో ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లోనూ మెరిసిన ఈ అందాల తార 2013లో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తల్లిగా కూడా మారింది. అయినా ఈ అందాల తార క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన టీవీ షోస్, సీరియల్స్ తో బిజి బిజీగా గడుపుతోంది.
ఇంతకీ ఈ బ్యూటీ ఎవరనుకుంటున్నారా? తను మరెవరో కాదు నువ్వు నేను సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు ఫేవరెట్ గా మారిపోయిన అనిత.నువ్వు నేను, తొట్టి గ్యాంగ్, శ్రీరామ్, నిన్నే ఇష్టపడ్డాను, మనలో ఒకడు తదితర సినిమాల్లో నటించిన అనిత కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. 2013లో గోవా వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. పెళ్లయిన ఎనిమిదేళ్లకు అంటే 2021లో ఈ దంపతులకు కుమారుడు పుట్టాడు.
గ్లామరస్ లుక్ లో అనిత..
View this post on Instagram
కాగా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది అనిత. తన గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ ను అందులో షేర్ చేస్తుంటుంది. వీటిని చూస్తుంటే త్వరలోనే ఈ ముద్దుగుమ్మ కూడా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదంటున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..